KA Paul Fires : చంద్రబాబు దేశాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్-కేఏ పాల్ | KA Paul Fires On Chandrababu, Pawan Kalyan

KA Paul Fires : చంద్రబాబు దేశాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్-కేఏ పాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.(KA Paul Fires)

KA Paul Fires : చంద్రబాబు దేశాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్-కేఏ పాల్

KA Paul Fires : నిన్నటివరకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల ను టార్గెట్ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాల్. చంద్రబాబు రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశాడని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకి వయసు అయిపోందన్న పాల్.. కొడుకు కోసమే ఆయన ఇంకా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని కూడా అన్నారు.

Attack On KA Paul : కేఏ పాల్ పై దాడి

పవన్ కళ్యాణ్ పైనా తీవ్ర విమర్శలు చేశారు పాల్. పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో ఆయనకే తెలియదన్నారు. తొమ్మిది పార్టీ లు.. తొమ్మిది నామాలు పెట్టారని పవన్ ను విమర్శించారు. బీజేపీ మతతత్వ పార్టీ అని తిట్టిన పవన్.. ఇప్పుడు అదే పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి పవన్ కు లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు పవన్ అన్న చిరంజీవికి వంద కోట్ల ప్యాకేజీ ఇచ్చారని పాల్ ఆరోపించారు. ఇప్పుడు పవన్ కు ఏ పార్టీ ఎన్ని కోట్ల ప్యాకేజీ ఇచ్చిందో తెలియదన్నారు.(KA Paul Fires)

కాంగ్రెస్ పార్టీ పైనా పాల్ నిప్పులు చెరిగారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ అన్న పాల్.. దేశాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ సభకు జనాన్ని తరలించారని పాల్ అన్నారు. రాహుల్ వాగ్దానాలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీ వాగ్దానాలు అమలు చేయండని డిమాండ్ చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడో మరిచిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశాన్నే అమ్మేస్తారని పాల్ అన్నారు. దేశానికి ఏదో చేస్తుందని కాంగ్రెస్ ను నమ్మితే .. నన్నే నమ్మించి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసిన మోసాలే, మిమ్మల్ని పాతాళానికి నెట్టేశాయన్నారు. నన్ను తొక్కేశారు, ఆ పాపం ఊరికే పోదు అని కేఏ పాల్ అన్నారు.

KA Paul On Telangana : తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే..నేనే..నేనే-కేఏ పాల్ హాట్ కామెంట్స్

2019 ఎన్నిక‌ల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హడావుడి చేసిన కేఏ పాల్ ఆ తర్వాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. తాజాగా మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయ‌ల్లో కేఏ పాల్ ప్ర‌త్యక్ష‌మయ్యారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. కొన్నిరోజులుగా కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే బస్వాపూర్ లో రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర పాల్‌పై దాడి జరిగింది. పోలీసులతో కేఏ పాల్ మాట్లాడుతుండగా.. సడెన్ గా ఓ వ్యక్తి పాల్ పై దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. దీనిపై పాల్ తీవ్రంగా స్పందించారు. తనను హత్య చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తనను చంపాలని చూస్తున్నారని పాల్ తీవ్ర ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.(KA Paul Fires)

×