Kotamreddy Sridhar Reddy: 2024లో వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డిస్మిస్ అవడం ఖాయం ..

2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు.

Kotamreddy Sridhar Reddy: 2024లో వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డిస్మిస్ అవడం ఖాయం ..

Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ (Cross voting) వ్యవహారం ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపింది. క్రాస్ ఓటింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ హైకమాండ్ అంతర్గతంగా దర్యాప్తు జరిపి నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. వారిలో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Undavalli Sridevi) లు ఉన్నారని, వారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైకాపా పార్టీ అధిష్టానం పేర్కొంది. ఈ అంశంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ, నేను ముందుగా ఊహించినట్లే జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kotamreddy Sridhar Reddy : అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

వైకాపా ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని, కొందరు బహిరంగంగా బయటకు వస్తున్నారని, ఎక్కువ మంది లోపల ఉడికి పోతున్నారని అన్నారు. మరో పార్టీకోసం ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు మాత్రం 2024 ఎన్నికలకు నిర్ణయం తీసుకుంటారని, 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుందని, వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తడ నుంచి ఇచ్చాపురం వరకు వైకాపా శాశ్వితంగా డిస్మిస్ అవుతుందని, ఘంటాపథంగా చెబుతున్నాను అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్లో ట్విస్ట్… అసలు విషయం చెప్పిన స్నేహితుడు

తన సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నానని తెలిపిన కోటంరెడ్డి.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకోసం కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు సరికాదని అన్నారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్నికోట్లు ఇచ్చారు సజ్జల అంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలవల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు.