న్యాయ రాజధానిగా కర్నూలు…రాయలసీమ ప్రజలు హర్షం

  • Published By: bheemraj ,Published On : July 31, 2020 / 06:16 PM IST
న్యాయ రాజధానిగా కర్నూలు…రాయలసీమ ప్రజలు హర్షం

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. అయితే కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం పట్ల కర్నూలుతోపాటు రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాయలసీమ జిల్లా వ్యాప్తంగా అనేక సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న శ్రీబాగ్ఒడంబడిక అమలు కాబోతున్న సందర్భంలో రాయలసీమ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా రాయలసీమ ప్రజలు ఆందోళన చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు విడిపోయిన తర్వాత న్యాయ రాజధానిగా ప్రకటించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఉండాలని అసెంబ్లీలో ప్రకటించారు.

అసెంబ్లీ, పరిపాలనా విభాగం, న్యాయ రాజధానులుగా మూడు విభాగాలుగా విభజించడంతో దాదాపు 6నెలలపాటు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు ఈ మధ్యకాలంలోనే గవర్నర్ కు వెళ్లడం, గవర్నర్ ఆమోదించడంతో సీఆర్డీఏ బిల్లు రద్దు కావడం, అదే విధంగా కర్నూలుకు న్యాయ రాజధాని రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీబాగ్ ఒడంబడిక సందర్భంలో పోరాటాలు చేసి కర్నూలు, రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగానే న్యాయ రాజధాని వచ్చింది. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ నిర్ణయం అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రతిపక్షాలు చేసిన అనేక ఆరోపణలపై రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు అత్యంత వెనుకబాటుకు గురైంది ఇప్పుడు న్యాయ రాజధాని కర్నూలుకు రాబోతున్న సందర్భంలో అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అనేక అడ్డంకులు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదని కర్నూలు జిల్లాతోపాటు రాయలసమీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి రాజధానిగా మడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉంది. తెలుగు ప్రజలు అందరూ ఒకే విధంగా ఉండాలి, కలిసి ఉండాలనే నమ్మకంతో ఆనాడు విడిపోయిన సందర్భంగా హైదరాబాద్ కు రాజధాని వెళ్లింది. శ్రీబాగ్ ఒడంబడిక ఒప్పందం ప్రకారం కర్నూలుకు రాజధానైనా ఇవ్వాలి లేకపోతే న్యాయశాఖ హైకోర్టు ఇవ్వాలని అనేక సంవత్సరాలు నుండి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర సీఎం జగన్ అసెంబ్లీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే అసెంబ్లీలో తీర్మానం చేశారు.

అసెంబ్లీ నుంచి శాసనమండలికి వెళ్లడంతో మండలిలో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువగా ఉండటంతో బిల్లును అడ్డుకోవడంతో గవర్నర్ దగ్గరకు పంపారు. గవర్నర్ ఈరోజు సీఆర్డీఏ బిల్లు రద్దు చేసి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటిస్తూ బిల్లుకు ఆమోద ముద్ర వేయడంతో రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాల పోరాట ఫలితంగానే కర్నూలులో న్యాయ రాజధాని వచ్చింది. ఇంకా అభివృద్ధికి అవకాశాలున్నాయి.

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అనేక రోజులు నుంచి సంబరాలు చేసుకుంటున్న సందర్బంగా ఈరోజు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ అత్యంత వెనుకబడింది. ఇప్పటికే మొత్తం ఎడారి కాబోతోంది. ఈ తరుణంలో కర్నూలుకు న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.