సీఎం జగన్ పబ్జీ గేమ్ ఆడుతారంటున్న లోకేష్

  • Edited By: madhu , February 29, 2020 / 10:09 AM IST
సీఎం జగన్ పబ్జీ గేమ్ ఆడుతారంటున్న లోకేష్

ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబడుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న విధానాలను తప్పుబడుతున్నారు. తాజాగా మరోసారి 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం పలు ట్వీట్స్ చేశారు. శుక్రవారం వస్తే చాలు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పి, బడి ఎగ్గొట్టినట్టు ఉంటాయన్నారు. 

Read More : బాలాజీ బడ్జెట్ : TTD పాలకమండలి సమావేశం..నిర్ణయాలు

ప్రతి రోజు తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడి కాలక్షేపం చేస్తూ, శుక్రవారం వస్తే తాను సీఎం అని గుర్తుకు వచ్చి, ఏదో ఒక రివ్యూ పెట్టి, కోర్ట్ కు డుమ్మా కొడతారంటూ విమర్శలు చేశారు. జగన్ పోలవరం పర్యటన చూస్తే, ఇదే అనిపిస్తుందని తెలిపారు. ముందుగా 27న పోలవరం పర్యటన అన్నారు..కాని అది 28కి ఎందుకు మారిందో, సీబీఐ కోర్ట్ లో జగన్ పిటీషన్ చూస్తే అర్ధమవుతుందని లోకేష్ వెల్లడించారు. 

Also Read | ఢిల్లీ బాబా రాసలీలలు : గుప్త ప్రసాదం పేరుతో యువతులతో శృంగారం

విశాఖలో చంద్రబాబు నాయుడిని వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఇరుపార్టీల మధ్య వైరం మరింత ముదిరింది. ఇరుపక్షాలకు చెందిన నేతలు మాటలతో తిట్టిపోసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పంచ్‌లు విసురుకుంటున్నారు. సీఎం జగన్ పోలవరాన్ని ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న పనులను పరిశీలించి తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ పర్యటనను టీడీపీ విమర్శలు చేస్తోంది. సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో పోలవరం పర్యటనను శుక్రవారం ఎంచుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా లోకేష్ చేసిన ట్వీట్స్‌కు వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.