Lokesh : మంగళగిరి ఓటమిపై స్పందించిన లోకేష్.. ఓడిన చోటే గెలిచి చూపిస్తా..

బాలకృష్ణ దీని గురించి అడుగుతూ.. ప్రజాప్రతినిధుల సభకు వెళ్లాలనే మొదటి అడుగు మంగళగిరి 2019లో ఓడిపోయావు అప్పుడు నీకేమనిపించింది అన్నారు. లోకేష్ దీనికి సమాధానమిస్తూ...........

Lokesh : మంగళగిరి ఓటమిపై స్పందించిన లోకేష్.. ఓడిన చోటే గెలిచి చూపిస్తా..

Lokesh reacts on Mangalagiri defeat

Lokesh :  బాలయ్య హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్‌ షో భారీ హిట్ అయి రికార్డులని కూడా సాధించడంతో ఈ షోకి సీజన్ 2ని కూడా ప్రకటించి గ్రాండ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లో అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా చంద్రబాబు, లోకేష్ ని తీసుకొచ్చారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, తాజాగా నేడు ఆహాలో మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఎపిసోడ్ రిలీజైన కొద్దిసేపటికే ఇది వైరల్ గా మారింది.

ఇక మొదటి ఎపిసోడ్ లో మాజీ సీఎం, బాలకృష్ణకు బావ అయిన చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. షోలో ఎన్నో సరదా విషయాలు, రాజకీయాలు మాట్లాడారు. అలాగే లోకేష్ కూడా రావడంతో లోకేష్ కి సంబంధించిన పలు విషయాలని కూడా ప్రస్తావించారు బాలకృష్ణ. ఇక 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సంగతి తెలిసిందే.

Chandrababu : వేంకటేశ్వరస్వామి వల్లే బతికి ఉన్నా.. అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనపై చంద్రబాబు..

బాలకృష్ణ దీని గురించి అడుగుతూ.. ప్రజాప్రతినిధుల సభకు వెళ్లాలనే మొదటి అడుగు మంగళగిరి 2019లో ఓడిపోయావు అప్పుడు నీకేమనిపించింది అన్నారు. లోకేష్ దీనికి సమాధానమిస్తూ.. ఓటమిలోనే చాలా నేర్చుకోవచ్చు. ప్రజలకి నేనేంటో చెప్పాలి అనుకున్నాను. చరిత్రలో పార్టీ ఎక్కడైతే గెలవలేదో, ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడే గెలవాలని ఫిక్స్ అయ్యాను. మూడేళ్ళ నుంచి అక్కడే మంగళగిరిలోనే ఉన్నాను. ప్రజలతో ఉంటున్నాను. ఓడిన చోటే గెలిచి చూపిస్తాను అని అన్నారు లోకేష్.