Chittoor : స్టాక్ స్ట్రోక్.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

స్టాక్ మార్కెట్లో నష్టపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది

Chittoor : స్టాక్ స్ట్రోక్.. ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

Chittoor

Chittoor : స్టాక్ మార్కెట్లో నష్టపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు శ్రీనగర్ కాలానీకి చెందిన భరత్ (23) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా చిత్తూరులోని తన నివాసం నుంచే వర్క్ చేస్తున్నాడు భరత్.. ఇక ఈ నేపథ్యంలోనే అతడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సుమారు రూ. లక్ష వరకు పోగొట్టుకున్నాడు. తిరిగి రావని ఆందోళన చెందిన భరత్ మంగళవారం చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళాడు.

చదవండి :  భార్యతో గొడవ.. ఓ కారు, నాలుగు బైకులకు నిప్పుపెట్టిన ఐటీ ఉద్యోగి.

బుధవారం ఉదయం కేఆర్ పురం రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భరత్ మృతితో శ్రీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

చదవండి :  బట్టతల దాచాడు…మ్యాట్రిమోని సైట్లలో యువతులకు ఎర, సాప్ట్ వేర్ ఇంజినీర్ చీటింగ్