Manda Krishna Madiga : మంద కృష్ణ మాదిగకు గాయం

ప్రమాదవశాత్తు కిందపడటంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు తుంటి ఎముక విరిగింది. ఢిల్లీలోకి వెస్ట్రన్ కోర్టు వాష్ రూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.

Manda Krishna Madiga : మంద కృష్ణ మాదిగకు గాయం

Manda Krishna Madiga

Manda Krishna Madiga : మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గాయపడ్డారు. రిజర్వేషన్ వర్గీకరణ అంశాలపై కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన ఆదివారం అక్కడి వెస్ట్రన్ కోర్టులోని బాత్ రూమ్ జారిపడ్డారు.. ఈ ప్రమాదంలో మందకృష్ణా తుంటి ఎముక విరిగింది. ఈ విషయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలియడంతో వెంటనే కార్యాలయ సిబ్బందిని పంపి ఆసుపత్రిలో చేర్చారు. ఇంద్రప్రస్థ అపోలో మందకృష్ణ చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్లు మందకృష్ణ సహచరులు తెలిపారు.