TDP Manifesto: టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా?

ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది.

TDP Manifesto: టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా?

TDP Manifesto – YCP Reaction : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ లీడర్ల మధ్య డైలాగ్ వార్(Dialogue War) కామన్. అప్పుడప్పుడు పోస్టర్ వార్ (Poster War), ఫ్లెక్సీ వార్‌ (Flexy War)లు.. అలా వచ్చి పోతుంటాయ్. ఇప్పుడు కొత్తగా.. ఏపీలో మ్యానిఫెస్టో వార్ (Manifesto) మొదలైంది. ఎప్పుడైతే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహానాడు (Mahanadu) వేదికగా మినీ మ్యానిఫెస్టో ప్రకటించారో.. అప్పట్నుంచే ఏపీలో మెగా పొలిటికల్ ఛేంజ్ కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా వైసీపీ నాయకులు, మంత్రులంతా.. మ్యానిఫెస్టోపై తమకు చేతనైనంతగా విరుచుకుపడ్డారు. అలా.. ఆ ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా.. సీఎం జగన్ కూడా.. టీడీపీ మ్యానిఫెస్టోపై.. ఘాటు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో (MIni Maifesto).. కాపీ పేస్ట్ మ్యానిఫెస్టో అని.. మహానాడు ఓ డ్రామా అని తన స్టైల్లో పంచ్‌లు పేల్చారు. అయితే.. ఎన్నికలకు ఏడాది ముందే మ్యానిఫెస్టోల విషయంలో ఈ స్థాయిలో రచ్చ జరుగుతుంటే.. రాబోయే రోజుల్లో ఈ డైలాగ్ వార్ ఎక్కడిదాకా వెళుతుంది?

ఏ క్షణాన చంద్రబాబు.. మహానాడు వేదికగా మినీ మ్యానిఫెస్టో ప్రకటించారో.. అప్పట్నుంచి ఏపీ రాజకీయాల్లో మంటలు రాజుకున్నాయ్. లీడర్ల మధ్య డైలాగులు ఓ రేంజులో పేలుతున్నాయ్. ఇప్పటికే.. వైసీపీ నాయకులు వరుసుపెట్టి తెలుగుదేశం మ్యానిఫెస్టోపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు.. ముఖ్యమంత్రి జగన్ కూడా టీడీపీ మ్యానిఫెస్టోపై ఘాటు కామెంట్స్ చేశారు. చంద్రబాబు మ్యానిఫెస్టో ఏపీలో పుట్టలేదని.. కర్ణాటకలో పుట్టిందని చెప్పారు జగన్. కర్ణాటకలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ్యానిఫెస్టోతో.. బిస్మిల్లా బాత్ వండేశారని.. అన్ని పార్టీల పథకాలు కాపీ చేసేసి మ్యానిఫెస్టో తెచ్చారని సెటైర్లు వేశారు జగన్.

కాపీ కొట్టేసి పులిహోర కలిపేశారు
అంతేకాదు.. వైసీపీ పథకాలను సైతం కాపీ కొట్టేసి.. పులిహోర (pulihora) కలిపేశారని బాగానే పంచ్‌లు పేల్చారు. అసలు.. మ్యానిఫెస్టో ఎలా తయారవుతుందో బాబుకు తెలుసా? అంటూ ప్రశ్నించడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ మ్యానిఫెస్టో.. తన పాదయాత్రలో ప్రజల కష్టాల మధ్య పుట్టిందన్నారు జగన్. పేదవాడి గుండె చప్పుడు నుంచి.. ఏపీ మట్టిలో నుంచి వైసీపీ మ్యానిఫెస్టో పుట్టిందని సీఎం జగన్ భారీ డైలాగులే పేల్చారు. అంతేకాదు.. చంద్రబాబుదంతా కాపీ పేస్ట్ వ్యవహారమని.. ఆయనకు క్రెడిబిలిటీ లేదని.. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లేని పార్టీ టీడీపీ అని ఘాటు విమర్శలు చేశారు. పొత్తుల కోసం ఎంతకైనా టీడీపీ దిగజారుతుందని విమర్శించారు. పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు కలగలిపిన పార్టీ టీడీపీ అని విరుచుకుపడ్డారు జగన్.

Also Read: ఏపీలో పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర షురూ .. మళ్లీ జనాల్లోకి జనసేనాని

జనం దీవెనలు ఉంటే చాలు
కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసగించారు. అందులో.. ఎక్కువగా తెలుగుదేశం మ్యానిఫెస్టోపైనే మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విమర్శించడం పైనే ఫోకస్ పెట్టారు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని.. దోచుకొని, దాచుకొని.. నలుగురూ పంచుకునేందుకు వారి పోరాటమని ఆరోపించారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో.. పేదవాడికి, పెత్తందారులకీ మధ్య యుద్ధం జరగబోతోందన్నారు జగన్. చంద్రబాబు డీపీటీ కావాలా.. మన డీబీటీ కావాలా? అని ప్రజల్ని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రచారానికి, జరుగుతున్న మంచికి మధ్య యుద్ధమని జగన్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల యుద్ధం జగన్‌తో కాదని.. పేదలతోనని.. తనకు కావాల్సింది జనం దీవెనలు మాత్రమేనని.. ముఖ్యమంత్రి చెబుతున్న డైలాగులు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయ్. నా నమ్మకం మీరే అని చెప్పడం.. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు సైనికుల్లా నిలబడండి అనడం లాంటి డైలాగులు.. తెలుగుదేశం హామీలకు జనం ఆకర్షితులవకుండా.. నిలువరించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లా కనిపిస్తున్నాయ్.

Also Read: ఎన్నో పనులు చేయాలనుకున్నాం.. కానీ..: చంద్రబాబు

 వైసీపీ ముందున్న టార్గెట్ అదే
నిజానికి.. ఒక మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా? అనే ప్రశ్న తలెత్తితే.. ఆన్సర్ అవుననే చెప్పాలి. ఎందుకంటే.. ఒక పార్టీ గెలుపోటములను, ఒక నాయకుడి విజన్‌ని చెప్పేదే మ్యానిఫెస్టో. పైగా.. సరిగ్గా ఎన్నికల ముందు రిలీజ్ చేయాల్సిన మ్యానిఫెస్టోని.. చంద్రబాబు ఏడాది ముందే ప్రజల్లోకి వదలడం, అందులో కురిపించిన హామీలపై ఏపీ మొత్తం చర్చ జరగడంతో.. వైసీపీకి ఇరకాటంలో పడేసినట్లయింది. ఇప్పట్నుంచే.. బాబు పవర్‌లోకి వస్తే ఏం చేస్తాడనే విషయంలో పబ్లిక్‌లో ఓ ఒపినీయన్ క్రియేట్ అవుతుంది. దానిని దెబ్బకొట్టడమే ఇప్పుడు వైసీపీ ముందున్న టార్గెట్. నిజానికి.. చంద్రబాబా? జగనా? అని తేల్చుకోవాల్సి వస్తే.. ఎవరి ప్లస్‌లు వాళ్లకున్నాయ్. ఇప్పుడు.. బాబు టార్గెట్ అంతా.. జగన్‌కు జనంలో ఉన్న ప్లస్ పాయింట్లను తగ్గించడమే. అందుకే.. మినీ మ్యానిఫెస్టో అంటూ.. సంక్షేమ పథకాలతో ఓ ఫీలర్‌ని జనంలోకి వదిలారు. అది.. అలా పబ్లిక్‌లో ఫిక్స్ అవకముందే.. డైవర్ట్ చేయాలనేది వైసీపీ ప్లాన్. అందుకే.. ఒక్కొక్కరు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు.

కాపీ-పేస్ట్ మ్యానిఫెస్టో అని ప్రచారం చేయడం వెనుక రీజనేంటి.. వివరాలకు ఈ వీడియో చూడండి..