కోర్సు పూర్తయ్యాక మూడేళ్లు ప్రభుత్వాస్పత్రుల్లో పని చేయాల్సిందే

కోర్సు పూర్తయ్యాక మూడేళ్లు ప్రభుత్వాస్పత్రుల్లో పని చేయాల్సిందే

Super‌ specialty medical students : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో
పని చేయాల్సిందే. అందుకోసం కోర్సులో చేరే సమయంలోనే 50 లక్షల రూపాయల పూచీకత్తు బాండును సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకులు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 70 వరకూ వివిధ విభాగాల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు ఉన్నాయి. ఈ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. కాబట్టి పేద ప్రజలకు సేవలందించడంలో భాగంగా సూపర్‌ స్పెషాలిటీ కోర్సు పూర్తయ్యాక మూడేళ్లపాటు ఇక్కడే సేవలు అందించాల్సి ఉంటుంది.

ఇలాంటి విధానం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలు అవుతోంది. అడ్మిషన్‌ సమయంలోనే వైద్య విద్యార్థుల నుంచి ఆమోద పత్రం తీసుకుని సీటు ఇవ్వనున్నారు.