Botsa On Chandrababu : టీడీపీ ఇక అధికారంలోకి రాదు, సొంత కొడుకు ఎందుకు ఓడిపోయాడు?- మంత్రి బొత్స

ఎన్టీఆర్ చైతన్య రథం లానే టీడీపీ తుప్పు పట్టేసిందన్న మంత్రి బొత్స.. ఆ వాహనాన్ని పక్కన పెట్టేసినట్టే టీడీపీని ప్రజలు పక్కన పెట్టేశారని..(Botsa On Chandrababu)

Botsa On Chandrababu : టీడీపీ ఇక అధికారంలోకి రాదు, సొంత కొడుకు ఎందుకు ఓడిపోయాడు?- మంత్రి బొత్స

Botsa On Chandrababu

Botsa On Chandrababu : టీడీపీ పార్టీపైన, చంద్రబాబుపైన ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ చైతన్య రథం లానే టీడీపీ తుప్పు పట్టేసిందన్న మంత్రి బొత్స.. ఆ వాహనాన్ని పక్కన పెట్టేసినట్టే టీడీపీని ప్రజలు పక్కన పెట్టేశారని కామెంట్ చేశారు. టీడీపీకి జవసత్వాలు పోయాయన్న మంత్రి బొత్స.. ఇక అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు.

కాగా, చంద్రబాబుని రాముడి పేరుతో పోల్చడం చాలా అతిగా ఉందన్నారు. చంద్రబాబు ఏ విధంగా రాముడితో సరిపోతాడు..? సొంత మామకి వెన్నుపోటు పొడిచినందుకా..? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది వైఎస్ఆర్ అని, చంద్రబాబు కాదని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్ ప్రారంభించినవే అని మంత్రి బొత్స తెలిపారు.(Botsa On Chandrababu)

TDP 40th Formation Day : చంద్రన్న రాముడు.. ఎవరినీ వదలను, సినిమా చూపిస్తానంటున్న నారా లోకేష్

చంద్రబాబే అన్ని చేసేస్తే మరి, సొంత కొడుకు నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? అని బొత్స అడిగారు. వైసీపీలో 60 శాతం కంటే ఎక్కువమందే ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు బొత్స సత్యనారాయణ. ఇప్పుడు వచ్చినవి కేవలం ప్రతిపాదనలు మాత్రమే అని ఆయన తెలిపారు.

”ఎన్టీఆర్‌ చావుకు కారణమైన చంద్రబాబును రాముడితో పోలుస్తారా? 40 ఏళ్ల ఉత్సవాలంటూ టీడీపీ హడావుడి చేస్తోంది. ఎన్టీఆర్ చైతన్య రథం ఏ పరిస్థితిలో బూజు పట్టి ఉందో టీడీపీ కూడా అలాగే ఉంది. చంద్రబాబుకు సమిష్టి అభివృద్ధి అన్న ఆలోచన పోయింది.. విశాల దృక్పథం కరువైంది. చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలు వదిలేసి కొత్త సిద్ధాంతాలు తెచ్చాడు. చంద్రబాబుకి రాముడు అనే మాట ఎలా సరిపోతుందో చెప్పండి. సొంత మామకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎయిర్‌పోర్ట్‌, రింగ్ రోడ్డు అని మళ్లీ అదే పాట అందుకున్నాడు. అవి కట్టింది వైఎస్ఆర్. జలయజ్ఞం ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ అని అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి చంద్రబాబు ప్రాజెక్టులపై డాంబికాలు చెప్పుకుంటున్నాడు. అవన్నీ చేస్తే నీ కొడుకు నీ ఇంటి పక్కనే ఎందుకు ఓడిపోయాడు’’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

Nara Lokesh: జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే!: నారా లోకేష్

‘‘వైఎస్ఆర్ విధానాలను వైఎస్ జగన్ మళ్లీ అమలు చేస్తున్నారు. చంద్రబాబు చేసింది.. అమరావతి భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఇక టీడీపీ జవసత్వాలు కోల్పోయింది. వారికి ఎటువంటి విధానాలు లేవు. మాకు ఒక విధానం ఉంది. దాన్ని ప్రజలకు చెప్పి ఓటు అడిగాం. ఆ విధానాలనే మా నాయకుడు అమలు చేస్తున్నారు. పరిపాలనలో ఒక విప్లవం తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం’’ అని మంత్రి బొత్స అన్నారు.

Buddha Venkanna: టీవీల్లో కొడాలినానిని చూస్తే పిల్లలు బూచోడు అంటున్నారు: బుద్ధా వెంకన్న