Gudivada Amarnath : చంద్రబాబుకు దోమలు కుడితే జైలులో అన్నిసేవలు ఉన్నాయి : మంత్రి గుడివాడ అమర్నాథ్

చంద్రబాబు ఉన్నది వెల్ నెస్ సెంటర్లో కాదు జైల్లో వున్నారు. నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే జైల్లో పెట్టింది. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే వార్తలు కేవలం సింపతీ కోసమే.

Gudivada Amarnath : చంద్రబాబుకు దోమలు కుడితే జైలులో అన్నిసేవలు ఉన్నాయి : మంత్రి గుడివాడ అమర్నాథ్

Gudivada Amarnath

Updated On : October 11, 2023 / 4:30 PM IST

Minister Gudivada Amarnath : విశాఖపట్నంలో సెంట్రల్ పార్క్ నందు గుడివాడ గురునాథ్ రావు 68 జయంతీ వేడుకల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతు..చంద్రబాబు వెల్ నెస్ సెంటర్లో కాదు జైల్లో వున్నారు.నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే జైళ్లను పెట్టింది అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే వార్తలు కేవలం సింపతీ కోసమేనంటూ కొట్టిపారేశారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టిన జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ లోకేశ్ పై కూడా విమర్శలు చేస్తు..సీఐడీ విచారణ తర్వాత లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారితో నిజం చెప్పరు..సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయి కానీ లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదు అంటూ సెటైర్లు వేశారు.

Jail DIG Ravikumar : చంద్రబాబుకు అస్వస్థత అనేది అవాస్తవం.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కోస్టల్ శాఖ జైలు డీఐజీ

హెరిటేజ్ కోసం అమరావతిలో 14ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు.మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని లోకేష్ తప్పుకి శిక్షపడ్డం ఖాయమని అన్నారు.విశాఖలో ఐటీ అభివృద్ది దిశగా వెళ్లుతుందన్నారు.16న ఇన్పోసిస్ కార్యలయం సీఎం చేతులు మీదుగా ప్రారంభం అవుతుందని అన్నారు.