Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు.

Minister Roja: తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా స్పందించారు. మంగళవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో సీఎం జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ హత్యకు పాల్పడితే చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని..న్యాయం ఎటువైపు ఉంటే జగన్ ఆ వైపు ఉంటారని మంత్రి రోజా అన్నారు. హతుడు సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులకు సీఎం జగన్ ఆదేశించారని రోజా తెలిపారు. సీఎం జగన్ దావోస్ పర్యటనలో చాలా కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారన్న రోజా ఏపీకి పదివేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంఓయూ చేసుకున్నట్లు తెలిపారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా ప్రజలకు భరోసా ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు.
పప్పు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ లోకేష్ నుద్దేశించి మంత్రి రోజా ఘాటు విమర్శలు చేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ పథకాలను మార్చి చంద్రబాబు పేరు పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటికీ అన్నీ వర్గాలకు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని, జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. గడపగడపకూ ప్రభుత్వ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆమె చెప్పారు. దేశంలో తొలిసారిగా ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్లేందుకు బయపడుతుంటే, అధికార పక్షం ప్రజల్లోకి వెళ్తోందని మంత్రి రోజా అన్నారు.
other stories:Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
- CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
- AP Politics: ట్వీట్లతో హీటెక్కుతున్న ఏపీ రాజకీయం
- Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
- AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్
- AP Cabinet Decisions : కోనసీమ జిల్లా పేరు మార్పు, 27న ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
1Russia – Ukraine War: పుతిన్ మహిళ అయి ఉంటే యుద్ధం ఉండేది కాదు – ప్రధాని
2Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్నాథ్ షిండే
3Chhattisgarh: సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన నక్సలైట్లు
4Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
5Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి
6Better Sleep: ప్రశాంతమైన నిద్ర కోసం బెస్ట్ ఎక్సర్సైజులు
7Tesla: కూర్చోవడానికీ ప్లేస్ లేని టెస్లా ఆఫీస్.. ఉద్యోగుల అవస్థలు
8Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
9Mukesh Ambani: రిటైల్ యూనిట్ ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ కూతురు
10Viral News: మనుషులకైనా ఇంత ప్రేమ ఉండదేమో..! యజమాని కోసం పెంపుడు కుక్క ఎదురుచూపులు..
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి