Kanipakam Temple : కాణిపాకం రథ చక్రాలకు నిప్పు.. చిత్తు కాగితాలు ఏరుకునే వారి పనే?

కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే..

Kanipakam Temple : కాణిపాకం రథ చక్రాలకు నిప్పు.. చిత్తు కాగితాలు ఏరుకునే వారి పనే?

Kanipakam Temple

Kanipakam Temple : చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయ సమీపంలో కాణిపాకం ఆలయానికి చెందిన పాత రథ చక్రాలకు దుండగులు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథ చక్రాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రథ చక్రాలకు నిప్పు ఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు.

కాలిపోయిన రథ చక్రాలు సుమారు 15 సంవత్సరాల కిందటివి అని చెప్పారు. కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే వారు ఎవరో ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు.

Back Pain : నడుంనొప్పి బాధించటానికి కారణాలు తెలుసా?

ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను కోరామని ఎమ్మెల్యే బాబు, ఆలయ ఛైర్మన్ వెల్లడించారు. కాణిపాకం ఆలయ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రథ చక్రాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

ఇటీవల ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు కలకలం రేపాయి. ఆ తర్వాత తగ్గిపోయాయి. ఆలయాలపై దాడులు తగ్గుముఖం పట్టాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై మళ్లీ దుమారం మొదలైంది. గతంలో పవిత్ర పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించగా.. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురవడంపై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు ప్రకటించారు.