అంగుళం కూడా కదలదు.. రాజధాని ఎలా తరలిస్తారో చూస్తా : సుజనాచౌదరి

అమరావతిలో ఆందోళనలు, మూడు రాజధానుల వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న మహిళలను నిర్బంధించడం,

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 05:08 AM IST
అంగుళం కూడా కదలదు.. రాజధాని ఎలా తరలిస్తారో చూస్తా : సుజనాచౌదరి

అమరావతిలో ఆందోళనలు, మూడు రాజధానుల వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న మహిళలను నిర్బంధించడం,

అమరావతిలో ఆందోళనలు, మూడు రాజధానుల వివాదంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా స్పందించారు. రాజధాని కోసం ఆందోళనలు చేస్తున్న మహిళలను నిర్బంధించడం, వారిపై దాడి చేయడం దారుణం అన్నారు. పోలీసులు మహిళల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఇంటి తలుపులు తట్టి బతిమలాడితే రాజధాని కోసం భూములు ఇచ్చారని సుజనా చౌదరి చెప్పారు. అమరావతి రాజధాని కోసం కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఉద్యమించాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు.

ఇస్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. అమరావతి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని ఎంపీ సుజనా తేల్చి చెప్పారు. రాజధానిని ఎలా తరలిస్తారో చూస్తామన్నారు. అమరావతి కోసం 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలన్న ఆయన.. అమరావతిలో అంత జరుగుతున్నా.. శాంతి భద్రతలపై డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కాగా, రాజధాని తరలింపు అంశంపై బీజేపీ నేతలు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అంశమని.. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత జీవీఎల్ అన్నారు. బీజేపీ ప్రతినిధిగా తాను ఈ మాట అంటున్నానని, తను చెప్పిందే పార్టీ స్టాండ్ కూడా చెప్పారు. సుజనాచౌదరి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని ఎలా తరలిస్తారో చూస్తానని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. తాజాగా సుజనాచౌదరి చేసిన కామెంట్స్ పై బీజేపీ నాయకుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Also Read : రూ.కోటి విలువైన భూమి ధర 10లక్షలకు పడిపోయింది : జగన్ పాలన చూస్తుంటే రక్తం మరుగుతోంది