ఏపీలో రేపు మున్సిపల్‌ పోలింగ్‌..ఓటరు తీర్పుపై అభ్యర్థుల్లో టెన్షన్‌

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడతో పార్టీలన్నీ పోలింగ్‌పై దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్‌ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై కసరత్తు చేస్తున్నారు.

ఏపీలో రేపు మున్సిపల్‌ పోలింగ్‌..ఓటరు తీర్పుపై అభ్యర్థుల్లో టెన్షన్‌

municipal election polling : ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసిపోవడతో పార్టీలన్నీ పోలింగ్‌పై దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్‌ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై కసరత్తు చేస్తున్నారు. రేపే పోలింగ్‌ జరుగనుండడంతో.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడంపై ఫోకస్‌ చేస్తున్నారు. వార్డుల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు.

మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల రేంజ్ లో సాగింది. అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆరోపణలు, విమర్శల పర్వం హద్దులు దాటింది. ఆఖరి రోజు సైతం అన్ని పార్టీలు స్పీడుగా ప్రచారాన్ని ముగించాయి. ప్రచారం ముగిసినా.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్‌కు ఒకరోజే మిగిలి ఉండడంతో అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిని ప్రలోబాలకు గురిచేసే అవకాశముంది.

ఇప్పటికే భారీగా షాపుల నుంచి మద్యం స్టాక్ తెచ్చి పెట్టుకున్న అభ్యర్థులు.. మందుబాబులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగదు, ఇతరత్రా పంచే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.

ఏపీలోని 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు రేపు పోలింగ్‌ జరగనుంది. అనంతరం 14న కౌటింగ్ చేపడతారు. మొత్తం 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే.. 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. 75 మున్సిపాల్టీల్లో 2123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకోనున్నారు.