Nandamuri Lakshmi Parvati : ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు వల్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారు : నందమూరి లక్ష్మి పార్వతి
మాట్లాడదాం రమ్మని ఎమ్యెల్యేలు పిలిస్తే ఎన్టీఆర్ వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్తే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Lakshmi Parvati - Chandrababu
Lakshmi Parvati Comments : ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారని వెల్లడించారు. బ్యాంక్ లోని డబ్బులు కూడా విత్ డ్రా చేయనీయలేదని.. అప్పుడు ఈ దుర్మార్గుడు(చంద్రబాబు) ఎంత వేధిస్తున్నాడని ఎన్టీఆర్ బాధపడ్డారని తెలిపారు. ‘చంద్రబాబు ఓడిపోయి.. మామా అని వచ్చి కాళ్లు పట్టుకుంటే పార్టీలో చేర్చుకున్నానని ఎవ్టీఆర్ చనిపోయే ముందు అన్నారు’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను గెలిపించి పేద ప్రజలు ఇచ్చిన తీర్పును చంద్రబాబు దారుణంగా మోసం చేశాడని మండిపడ్డారు.
మాట్లాడదాం రమ్మని ఎమ్యెల్యేలు పిలిస్తే ఎన్టీఆర్ వైశ్రాయ్ హోటల్ వద్దకు వెళ్తే చెప్పులు వేయించారని ఆరోపించారు. ఎన్టీఆర్ హంతకుడు చంద్రబాబు ఆయన శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ‘నా కొడుకు, కూతుర్లను కూడా దూరం చేశాడని ఎన్టీఆర్ బాధ పడ్డారు’ అని లక్ష్మి పార్వతి తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధం పథకాన్ని లిక్కర్ మాఫియాతో కుమ్ముక్కై ఎత్తివేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడలో లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడారు.
BJP vs Congress: పార్లమెంట్ భవనంపై రచ్చ లేపి, అసెంబ్లీ భవవం వద్ద అడ్డంగా ఇరుక్కున్న కాంగ్రెస్
జంతువులకు కూడా సిగ్గు ఉంటుంది.. కానీ, సిగ్గులేని వాళ్లు శత జయంతి ఉత్సవాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మనం చేద్దామని దేవివేని నెహ్రూ కుమారుడు అవినాష్ వచ్చి అడిగాడు’ అని తెలిపారు. ఇద్దరం కలిసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చేసే హక్కు తనకు, అవినాష్ కు ఉందన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. దేవినేని నెహ్రూ కూడా ఎన్టీఆర్ చనిపోయేంత వరకు నమ్మకంగా ఆయన వెంటే ఉన్నారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో లోకేష్ ఫొటోలు ఎలా పెడతారు? లోకేష్ కు ఎన్టీఆర్ కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. జూనియర్ ఎవ్టీఆర్ కు సినిమాలు ఇవ్వకూడదని చంద్రబాబు ప్రయత్నం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇలా చెప్పాడని నిర్మాతలు బయటకు వచ్చి చెప్పలేరు కదా? అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాగా మాట్లాడతారని, ఆయనకు ఎన్టీఆర్ పోలికలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ఆయన అవసరం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను కలుపుకుని ప్రచారం చేయించుకున్నాడని పేర్కొన్నారు.
పది, పదిహేను సంవత్సరాల తరువాత తెలుగుదేశంలోకి వస్తే పార్టీని నిలుపుతాడని తెలిపారు. ‘తల్లి అయినా, అత్త అయినా మీరే అని చంద్రబాబు నా వద్దకు వచ్చాడు.. మా మామ పార్టీ నుండి నన్ను వెళ్లిపోమంటున్నారు.. మీరే కాపాడాలని నా వద్దకు చంద్రబాబు వచ్చాడు’ అని లక్ష్మి పార్వతి పేర్కొన్నారు. జూనియర్ ప్రభ ఆకాశంలో వెలుగుతుంటే… భూమి మీద ఉన్న తెలివి లేని ఆయన కొడుకు లోకేష్ ను చంద్రబాబు సీఎం చేయాలనుకుంటున్నాడు అని విమర్శించారు.
ఎన్టీఆర్ కొడుకులకు కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేసే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. పేద వర్గాల కోసం టీడీపీని ఎవ్టీఆర్ స్థాపించారని పేర్కొన్నారు. చంద్రబాబు టీడీపీని కార్పొరేట్ వర్గం చేశారని విమర్శించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే వారు ఇప్పుడు చంద్రబాబు వెంట ఉన్నారని.. వారిని పార్టీలు మార్పిస్తాడు… తెచ్చుకుంటారని పేర్కొన్నారు.