Nara Lokesh: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా?: నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవని లోకేశ్ అన్నారు.

Nara Lokesh: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏంటో తెలుసా?: నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్

Nara Lokesh

Nara Lokesh: దళితులపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) చూపిస్తున్నది కపట ప్రేమేనంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా తాడికొండలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ముందు ఇవాళ లోకేశ్ సెల్ఫీ తీసుకుని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

” నా ఎస్సీలు, నాఎస్టీలు, నా బీసీలు అంటూ దీర్ఘాలు తీస్తూ కపటప్రేమ చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాస్తవంలో మాత్రం ఆయా వర్గాలను తీవ్ర నిర్లక్ష్యంచేస్తూ, తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్నది తాడికొండలో మా ప్రభుత్వ హయాంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల.

గత టీడీపీ ప్రభుత్వంలో దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం తాడికొండతోపాటు గుంటూరు జిల్లాలో మరో నాలుగు చోట్ల సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన గురుకుల పాఠశాలలు నిర్మించాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పేద దళిత విద్యార్థుల కోసం ఒక్క స్కూలూ నిర్మించిన దాఖలాలు లేవు. గత నాలుగేళ్లలో అంబేద్కర్ విదేశీ విద్యతో 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్మోసపురెడ్డి ” అని లోకేశ్ పేర్కొన్నారు.

Tirumala : మధ్యాహ్నం 2గంటల వరకే వారికి అనుమతి, ప్రతి భక్తుడికి ఊతకర్ర- చిరుత దాడితో నడకదారిపై టీటీడీ కీలక నిర్ణయాలు