Telugu Akademi Scam : పదేళ్లలో రూ.200 కోట్లు మాయం.. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కోట్లు కొట్టేశారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ స్కామ్ లో కొత్త కోణం బయటపడింది. సాయికుమార్ గ్యాంగ్ తెలంగాణలోనే కాదు ఏపీలోనూ డబ్బులు కొట్టేశారు. ఏపీలో 2 ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజ

Telugu Akademi Scam : పదేళ్లలో రూ.200 కోట్లు మాయం.. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కోట్లు కొట్టేశారు

Telugu Akademi Scam

Telugu Akademi Scam : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన తెలుగు అకాడమీ స్కామ్ లో కొత్త కోణం బయటపడింది. సాయికుమార్ గ్యాంగ్ తెలంగాణలోనే కాదు ఏపీలోనూ డబ్బులు కొట్టేశారు. ఏపీలో 2 ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్లు సాయికుమార్‌ ముఠా కాజేసింది. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రూ.10 కోట్లను కొట్టేసిన సాయికుమార్‌.. ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌లో రూ.5 కోట్ల ఎఫ్‌డీలను డ్రా చేశాడు. ఏపీకి చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు సాయికుమార్‌ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఏపీ సంస్థల నుంచి డిపాజిట్లను ఐవోబీ బ్యాంక్‌ నుంచి బదిలీ చేశారు. ఐవోబీ నుంచి ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ద్వారా బదిలీ, విత్‌ డ్రా చేయగా, ఏపీకి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏపీ అధికారులకు సీసీఎస్‌ పోలీసులు సమాచారం ఇచ్చారు. సాయికుమార్‌ ముఠాపై రెండు కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై పోలీసులు దృష్టి పెట్టారు.

Prakash Raj : భోరున ఏడ్చిన బెనర్జీ.. మా అమ్మను తిట్టారంటూ తనీష్ భావోద్వేగం..

తెలుగు అకాడమీ నిధులు కోట్లాది రూపాయల మేర గల్లంతైన వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికుమార్ కోట్లు కొల్లగొట్టినట్టు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సాయికుమార్, అతని అనుచరులు గత పదేళ్ల కాలంలో సుమారు రూ.200 కోట్ల వరకు స్వాహా చేసినట్టు గుర్తించారు. సాయికుమార్ ముఠా ప్రభుత్వ సంస్థల ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టడంలో ఆరితేరినట్టు వెల్లడైంది.

సాయికుమార్, అతని అనుచరులు 12 ఏళ్ల క్రితం ఓ ముఠాగా ఏర్పడ్డారు. సాయికుమార్ బృందంపై ఇప్పటికే 7 కేసులు ఉన్నాయి. సాయికుమార్ గతంలో స్వాల్ కంప్యూటర్స్ పేరిట ఓ సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించాడు. చెన్నైకి చెందిన నేరస్తులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. క్రమంగా వీరు ఓ ముఠాగా ఏర్పడి, బ్యాంకు అధికారులతో పరిచయాలు పెంచుకుని ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేయడం ప్రారంభించారు.

Uttej: అన్నయ్యనే అనుమానిస్తావా? ఫేస్‌లో ఫేస్ పెట్టి అమ్మను తిట్టాడు

జాతీయ, కార్పొరేట్, సహకార బ్యాంకు మేనేజర్లతో ఈ ముఠాకు పరిచయాలు ఉన్నాయి. తమ గోల్ మాల్ వ్యవహారంలో పలువురు బ్యాంకు మేనేజర్లను కూడా భాగస్వాములుగా చేశారు. కమీషన్ల ఆశ చూపి ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఫిక్స్ డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు. ఒప్పందం చేసుకున్న బ్యాంకుల్లోనే ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్లు గోల్ మాల్ చేసేలా ప్రణాళిక రచించారు.

ఈ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్ చేశామని, రిమాండ్ రిపోర్టులో సీసీఎస్ పోలీసులు తెలిపారు. కీలక సూత్రదారి సాయికుమార్‌గా తేల్చారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు.

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ.64.05 కోట్లు కొల్లగొట్టిన ఘరానా నిందితులు వాటిని వాటాలుగా పంచుకున్నారని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సాయికుమార్‌ రూ.20 కోట్లు తీసుకోగా… ఏపీ మర్కంటైల్‌ సహకార క్రెడిట్‌ సొసైటీ ఛైర్మన్‌ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్‌ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

ప్రధాన నిందితుడు సాయికుమార్ తన వాటా కింద తీసుకున్న సొమ్ముతో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 35 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. అది వివాదాల్లో ఉండడంతో నగదు లేదని సాయికుమార్‌ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అలాగే, పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్‌ నుంచి తక్కువ ధరకే డీజిల్‌ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చానని, అతడు కనిపించకుండా పోయాడని వివరించినట్టు తెలుస్తోంది.

పదేళ్లలో రూ.200 కోట్లు మాయం..
* ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు
* పీసీ బోర్డులో రూ.15 కోట్లు
* మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు
* ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రూ.10 కోట్లు
* ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌లో రూ.5 కోట్లు