హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు

హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు

Panchayat election : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యంగా దృష్ట్యా ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చేపడితే..వ్యాక్సినేషన్ కు ఆటంకం కలిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నోటిఫికేషన్‍‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రస్తుత పరిణామాలను వివరిస్తూనే… షెడ్యూల్‌పై స్టే ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. పరిస్ధితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం పూర్తి స్థాయిలో విచారించి ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిర్వహణ చేయాలని ఎన్నికల సంఘం భావిస్తూ వచ్చింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కరోనా వ్యాక్సిన్ సన్నద్ధతలో అధికారయంత్రాంగం అంతా ఉందని, వ్యాక్సిన్ నేషన్ వల్ల స్థానిక ఎన్నికల నిర్వాహణ సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడించిది. ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘననే అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటిఫికేషన్ అనంతరం వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో ఉన్నామని చెప్పినా..మొండి వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.