Lokesh On Pegasus Spyware : పెగాసస్ వివాదం.. ఏ విచారణకైనా సిద్ధం-నారా లోకేష్

పెగాస‌స్‌పై.. హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని..(Lokesh On Pegasus Spyware)

Lokesh On Pegasus Spyware : పెగాసస్ వివాదం.. ఏ విచారణకైనా సిద్ధం-నారా లోకేష్

Lokesh On Pegasus Spyware

Lokesh On Pegasus Spyware : పెగాసస్ సాఫ్ట్ వేర్(స్పై వేర్).. గ‌త కొన్ని రోజులుగా ఏపీలో రాజ‌కీయ దుమారం రేపుతున్న అంశం. టీడీపీ ప్రభుత్వం హయాంలో పెగాస‌స్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసిందంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. దీనిపై ఏపీలో రచ్చ జరుగుతోంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ విషయంలో టీడీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేశ్ కీలక ప్ర‌క‌ట‌న చేశారు.

పెగాస‌స్‌పై.. హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం శాస‌న‌మండలిలో వైసీపీ ప్ర‌తిపాదించిన మేర‌కు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ అనుమ‌తి ఇచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అదే స‌మ‌యంలో వైసీపీకి ఓ స‌వాల్ కూడా విసిరారు లోకేష్. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య, ప‌శ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మరణాల విషయాల్లో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా? అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా? లేదా? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేద‌న్న లోకేశ్.. పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు ఇచ్చిన స‌మాధానాన్ని గుర్తు చేశారు. వ్యక్తులకు గానీ, ప్రైవేట్ సంస్ధలకు గానీ పెగాసస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని లోకేశ్ తెలిపారు.(Lokesh On Pegasus Spyware)

MLA Ambati : పెగాసేస్ స్పై వేర్ కొనుగోళ్లపై కేంద్రం విచారణ చేపట్టాలి : ఎమ్మెల్యే అంబటి

ఏపీలో గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయ దుమారం రేపుతున్న పెగాస‌స్ సాఫ్ట్ వేర్ కొనుగోలు వివాదంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేశ్ ప్ర‌క‌ట‌న చేశారు. పెగాస‌స్‌పై హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం నాడు శాస‌న‌మండలిలో వైసీపీ ప్ర‌తిపాదించిన మేర‌కు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ అనుమ‌తి ఇచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మమతా బెనర్జీ ఆరోపణలు చేశారంటూ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ అంశంపై అసెంబ్లీలో చర్చ చేపట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఐదు రోజులుగా మద్యం, కల్తీ సారా మరణాలపై సభలో చర్చకు టీడీపీ పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని నారా లోకేష్ వాపోయారు. సారా మరణాలను సీఎం జగన్ సహజ మరణాలుగా తీసిపారేయడం బాధాకరమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా కారణంగా 42 మంది చనిపోయారని.. ప్రజల ప్రాణాల కంటే పెగాసస్ పెద్ద సమస్యగా ప్రభుత్వానికి కనిపిస్తుందా అని ప్రశ్నించారు. అందుకే జగన్ మోహన్‌ రెడ్డిని జగన్ మోసపు రెడ్డి అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు మనుషులు తాగేందుకు పనికిరాదని లోకేష్ అన్నారు.

మద్యం మరణాలపై మండలిలో చర్చకు తాము ప్రతి రోజూ డిమాండ్ చేస్తుంటే అనుమతించని చైర్మన్.. తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్‌పై చర్చ పెట్టడం దారుణం అన్నారు. ఏమన్నా అంటే 151 మంది ఉన్నారని అంటున్నారని.. భవిష్యత్తులో వైసీపీకి 15 మంది కూడా ఉండని పరిస్థితి వస్తుందని లోకేష్ హెచ్చరించారు.

Somireddy On Pegasus Spyware : పెగాసెస్ స్పైవేర్ చంద్రబాబు కొనుంటే, వివేకా హత్య జరిగేదే కాదు-సోమిరెడ్డి

ఇది ఇలా ఉంటే, పెగాసస్ వివాదం విషయంలో ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రెండు రోజుల్లో కమిటీ సభ్యులను ప్రకటిస్తామని స్పీకర్ తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన ఇతర అక్రమాలపైనా విచారణ జరగాలని సభ్యులు కోరినట్టు స్పీకర్ వెల్లడించారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. పెగాసస్ తేనె తుట్టేను కదిపారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీదీ చేసిన వ్యాఖ్యలపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు దీనిపై మాట్లాడారు. చివరకు హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.