సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఫిబ్రవరి నుంచి 54లక్షల మందికి పెన్షన్లు.. విద్యార్థులకు రూ.20వేలు

మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 01:24 PM IST
సీఎం జగన్ గుడ్ న్యూస్ : ఫిబ్రవరి నుంచి 54లక్షల మందికి పెన్షన్లు.. విద్యార్థులకు రూ.20వేలు

మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో ‘స్పందన’పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే

మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో ‘స్పందన’పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తారని సీఎం చెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందు పెన్షన్లు 39 లక్షలు ఉండేవని…ఇప్పుడు 54 లక్షలకు పైబడి ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు కొత్త పెన్షన్‌ కార్డులు, బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. బియ్యం కార్డు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే… 5 రోజుల్లోగా వారికి గ్రామ సచివాలయాల్లో కార్డు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు.
 

ఫిబ్రవరి 15 నాటికి ఇళ్ల పట్టాల అర్హుల జాబితా:
స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల్లో 60శాతం రేషన్, పెన్షన్, ఇళ్ల పట్టాలకు సంబంధించినవేనని సీఎం జగన్ చెప్పారు. స్పందనలో అధికారులు బాగా పని చేశారని ప్రశంసించారు. గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించిన అర్హుల జాబితాలను ప్రదర్శించారా? లేదా? అని ఆరా తీశారు. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సాధికార సర్వేకు, ఇళ్ల పట్టాల వ్యవహారానికి లింక్ పెట్టొద్దని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం వారి ముఖాల్లో సంతోషాన్ని నింపాలని సీఎం జగన్ అన్నారు.
 

గ్రామాల పర్యటనలో ఒక్కరు కూడా చెయ్యత్తకూడదు:
25 లక్షల మంది మహిళల పేర్ల మీద రూ.10 స్టాంపు పేపర్ల మీద ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు ఉంటుందన్నారు. ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలన్నారు. తాను గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఆ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే ఎవరు చెయ్యత్త కూడదన్నారు. ఎవరి వల్ల కూడా అన్యాయం జరిగిందన్న మాట వినిపించకూడదన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వదలచుకున్న స్థలాలను ఖరారు చేసే ముందు లబ్ధిదారుల్లో మెజార్టీ ప్రజలు దీనికి అంగీకారం తెలపాలన్నారు. మనకు ఓటు వేయకపోయినా పర్లేదు.. వారికి మంచి జరగాలన్నారు సీఎం జగన్. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు.
 

రైతులు బాగుండాలి:
ఇక, రైతు భరోసా కేంద్రాల ద్వారా మనదైన ముద్ర వేస్తున్నామన్నారు సీఎం జగన్. గ్రామ సచివాలయాల దగ్గరకే రైతు భరోసా కేంద్రాలు వెళ్లాలని.. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్టు ఇది.. నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామస్థాయిలో రైతులకు అందిస్తామని తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని… ఫిబ్రవరి 1 నుంచి వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో విడత దాదాపు 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించామన్నారు.
 

విద్యార్థులకు రూ.20 వేలు:
ఇక ఫిబ్రవరి 28న జగనన్న విద్యా వసతి దీవెన పథకం ప్రారంభిస్తామన్నారు సీఎం జగన్. ఈ స్కీమ్ కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.20వేలు( రెండు విడతల్లో) చెల్లిస్తామన్నారు.

Also Read : యుద్ధం వస్తే 10 రోజుల్లో ఓడిస్తాం : పాకిస్తాన్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు