Perni Nani : అన్నవరం కాకుండా చంద్రవరం అని పెట్టాల్సింది- పవన్ వారాహి యాత్రపై పేర్నినాని సెటైర్
Perni Nani : లోకేశ్ రాయలసీమలో తిరుగుతున్నాడు కనుక పవన్ ను గోదావరిలో తిప్పుతున్నారు. జనసేన అసలు రాజకీయ పార్టీ కాదు.

Perni Nani (Photo : Google)
Perni Nani – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రను ఇలా అనౌన్స్ చేశారో లేదో అప్పుడే వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. పవన్ వారాహి యాత్ర టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ యాత్రపై మాజీమంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ తన యాత్రకు అన్నవరం భీమవరం అని కాకుండా చంద్రవరం అని పెట్టాల్సింది అని పేర్నినాని ఎద్దేవా చేశారు. ఇంతకీ, వారాహి యాత్ర టూర్.. ప్యాకేజీనా? అని పవన్ ను ప్రశ్నించారు పేర్నినాని.
దసరా..సంక్రాంతి.. ఇప్పుడు అన్నవరం..భీమవరం:
” దసరా, ఉగాది అయిపోయాయి. ఇప్పుడు అన్నవరం భీమవరం వచ్చిందా? అన్నవరం భీమవరం యాత్ర కాకుండా చంద్రవరం అని పెట్టాల్సింది. చంద్రబాబు యాత్ర అని పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. సినిమా ముందు కలెక్షన్లు రికార్డులు చెప్పినట్టు ఈ యాత్ర ఏదో చేసేస్తుందని సొల్లు చెప్తారు.
సినిమా ప్రమోషన్ లా యాత్రకు ప్రమోషన్ చేస్తారు.(Perni Nani)
Also Read..TDP Manifesto: టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా?
జనసేన అసలు రాజకీయ పార్టీ కాదు:
మాకు అధికారం వద్దు, చంద్రబాబు గెలవాలని ఆయనే చెబుతున్నారు. జనసేన అసలు రాజకీయ పార్టీ కాదు. బిల్లపాడు కళాకారులు లాంటిది. నాలుగు సీట్లు మాకు ఇవ్వండి చాలు అంటున్నారు. వీళ్ళు ప్రజల కోసం యాత్ర చేసేదేంటి? చంద్రబాబు గోదావరి జిల్లాలోనే తిరగాలని చెప్పి ఉంటారు. పవన్ యాత్రకు ప్రభుత్వ అనుమతి కాదు. చంద్రబాబు అనుమతి ఉండాలి. లోకేశ్ రాయలసీమలో తిరుగుతున్నాడు కనుక పవన్ ను గోదావరిలో తిప్పుతున్నారు” అని పేర్నినాని విమర్శించారు.
అన్నవరం నుంచి పవన్ వారాహి యాత్ర..
పవన్ కల్యాణ్ మరోసారి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇందులో భాగంగా వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. పవన్ వారాహి యాత్రకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. వారాహి వాహనం ద్వారా పవన్ యాత్ర ఉంటుందని, ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.(Perni Nani)
విడతల వారిగా యాత్ర..
యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. పవన్ వారాహి యాత్రను ఒకే విడతగా కాకుండా విడతల వారీగా చేయనున్నారు. తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర ఉంటుంది. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు సాగుతుందని.. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పవన్ తొలివిడత యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యం:
యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో కార్యక్రమాలు ఉంటాయని నాదెండ్ల చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించేలా ఈ యాత్ర ఉంటుందన్నారు. జనసేన యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని నాదెండ్ల పేర్కొన్నారు. మొత్తంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తామన్నారు నాదెండ్ల మనోహర్.