Nimmala Ramanaidu : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్
Nimmala Ramanaidu : అరెస్ట్ ను తీవ్రంగా ప్రతిఘటించారు నిమ్మల. పోలీసులు ఆయనను బలవంతంగా జీప్ ఎక్కించారు.

Nimmala Ramanaidu
Nimmala Ramanaidu : పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మట్టి తవ్వకాలను నిరసిస్తూ దళితులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు.
దళితుల భూమిలో మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ రాత్రి నుంచి నిమ్మల రామానాయుడు ఆందోళన చేస్తున్నారు. అరెస్ట్ ను తీవ్రంగా ప్రతిఘటించారు నిమ్మల. పోలీసులు ఆయనను బలవంతంగా జీప్ ఎక్కించారు. నిమ్మల అరెస్టును అడ్డుకోవడానికి దళితులు, సీపీఎం కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
గడపవరం పోలీస్ స్టేషన్ లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళనకు దిగారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజినేయులు.. నిమ్మలకు సంఘీభావం తెలిపారు. నిడమర్రు, ఉంగుటూరు నేతలతో కలిసి నిమ్మల నిరసన తెలిపారు.
అటు కాకినాడ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. తొండంగిలో జరుగుతున్న సెజ్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వెళ్లడానికి అనుమతి లేదన్నారు. దీంతో వర్మ, టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వర్మ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు.