తగిన శాస్తి, లాక్‌డౌన్ వేళ రోడ్డుపైకి వచ్చిన వారిని చితక్కొట్టిన పోలీసులు

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 12:31 PM IST
తగిన శాస్తి, లాక్‌డౌన్ వేళ రోడ్డుపైకి వచ్చిన వారిని చితక్కొట్టిన పోలీసులు

కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు యువకులు, వ్యక్తులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. ఎవరూ బయటకు రాకూడదు. రోడ్లపై తిరక్కూడదు. అలా అయితేనే వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలం. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు యువకులు, వ్యక్తులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. బైక్ తో రోడ్డెక్కుతున్నారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారికి పోలీసులు గట్టిగా బుద్ది చెప్పారు. లాఠీలతో చితక్కొట్టారు.  ప్రకాశం జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన ఆకతాయిలపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఎలాంటి బాధ్యత లేకుండా యథేచ్చగా బైక్ పై చక్కర్లు కొడుతున్న యువకులను పట్టుకుని చితక్కొట్టారు. మరోసారి బయటకు వస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు.

అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసుల బాదుడు మొదలైంది. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన వారికి పోలీసులు లాఠీతో సమాధానం చెప్పారు. ఎలాంటి అవసరం లేకుండా రోడ్డుపైకి వచ్చిన వారిని పోలీసులు చితక్కొట్టారు. పలువురి వాహనాలు సీజ్ కూడా చేశారు. రోడ్డుపైకి వస్తే ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు.