Restrictions AP : ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

న్యూఇయర్ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదని తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. క్లబ్‌లు, రెస్టారెంట్లలో 60శాతం ఆక్యుపెన్సీతో వేడుకలు జరుపాలన్నారు.

Restrictions AP : ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

Ap New Year 11zon

Updated On : December 31, 2021 / 8:01 AM IST

Restrictions on New Year Celebrations : ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా కొవిడ్‌ నిబంధనల మధ్యే కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి విజయవాడలో వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12గంటల వరకు మాత్రమే ఇండోర్ వేడుకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లపై ఎవరూ తిరగకూడదంటూ హెచ్చరించారు. బెజవాడలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు సీపీ.

న్యూ ఇయర్ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదని తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. అలాగే క్లబ్‌లు, రెస్టారెంట్లలో 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు జరపాలని ఆదేశించారు. వీటికోసం రెస్టారెట్లు, క్లబ్‌లు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. డీజేలు, భారీ స్పీకర్లకు అనుమతి లేదు. నగర వ్యాప్తంగా 15 చోట్ల పోలీసులు డ్రంక్​ అండ్ డ్రైవ్​ టెస్టులు నిర్వహించనున్నారు.

Central Government : ఏపీ, తెలంగాణకు కేంద్రం పిలుపు.. విభజన సమస్యలు, వివాదాలపై చర్చ

ప్రధాన రహదారులైన బందర్​ రోడ్, ఏలూరు రోడ్​, బీఆర్​టీఎస్​రోడ్లలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజ్ సర్కిల్​ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్​, పీసీఆర్​ ఫ్లై ఓవర్‌లపై ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఇటు విశాఖ బీచ్ రోడ్డులో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలపై నిషేధం విధించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బీ‌ఆర్‌టీ‌ఎస్ సెంటర్ లైన్ రోడ్ మూసివేయనున్నారు. నగరంలో కేక్ కటింగ్‌లు, డీజేలపై కూడా నిషేదాజ్ఞలు జారీ చేశారు.