AP new cabinet : చిత్తూరు జిల్లాకు పెద్దపీట.. 8 జిల్లాలకు దక్కని ప్రాతినిద్యం..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ఖరారైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత, కొత్త వారితో కలిపి నూతన కేబినెట్‌ను రూపొందించారు. కొన్నిరోజులుగా అనేక కసరత్తుల నడుమ మంత్రుల తుది జాబితాను ...

AP new cabinet : చిత్తూరు జిల్లాకు పెద్దపీట.. 8 జిల్లాలకు దక్కని ప్రాతినిద్యం..

Ap Cm Ys Jagan

AP new cabinet : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ఖరారైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత, కొత్త వారితో కలిపి నూతన కేబినెట్‌ను రూపొందించారు. కొన్నిరోజులుగా అనేక కసరత్తుల నడుమ మంత్రుల తుది జాబితాను సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి సీఎంవో నుంచి కొత్త మంత్రుల జాబితా రాజ్ భవన్‌కు చేరింది. సోమవారం ఉదయం 11.30 నిమిషాలకు సచివాలయ ప్రాంగణంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవుల కేటాయింపులో స్థానం దక్కని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవులు ఇవ్వకుండా తమను మోసం చేశారంటూ పలువురు వైసీపీ నేతలు వైసీపీ అధిష్టానంపై మండిపడ్డారు. మంత్రి పదవి దక్కకపోవటంతో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ హోంమంత్రి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వీరిని బుజ్జగించే పనిలో వైసీపీ పెద్దలు నిమగ్నమయ్యారు.

Ys jagan : మారిన జగన్ వ్యూహం.. కొత్త కేబినెట్‌లో 10మంది పాత మంత్రులకు ఛాన్స్?

ఇదిలా ఉంటే మంత్రి వర్గ కూర్పుపైనా పలు జిల్లాల వైసీపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఎనిమిది జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిద్యం దక్కలేదు. చిత్తూరు జిల్లాకు అత్యధికంగా మూడు మంత్రి పదవులు దక్కాయి. ఈ జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామితో పాటు కొత్తగా రోజాకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. శ్రీకాకుళం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మంత్రి పదవులు దక్కాయి. ఇక విజయనగరం, మన్యం పార్వతీపురం, కాకినాడ, తూర్పుగోదావరి, బాపట్ల, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరికి మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి చోటు కల్పించారు.

AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్‌లో 14మంది కొత్త మంత్రులు.. 11మంది పాత మంత్రులు

అయితే మంత్రి వర్గంలో ఎనిమిది జిల్లాలకు ప్రాతినిద్యం లేకపోవటం పట్ల ఆయా జిల్లాల వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాలకు జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ లో అవకాశం కల్పించలేదు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇవ్వడంపైనా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. అయితే తొలుత చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి పేర్లను ఖరారు చేశారు. చివరి నిమిషంలో ఊహించని రీతిలో రోజా పేరు తెరపైకి రావడంతో ఆ జిల్లా అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లయిందని వైసీపీ పెద్దల వాదన. మొత్తానికి ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కొందరు వైసీపీ నేతల్లో సంతోషాన్ని నింపగా, మరికొందరు వైసీపీ నేతలను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.