Narayana: ఓ డేగలా నాపై కన్నేశాడు.. మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు

ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో రూపంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు.

Narayana: ఓ డేగలా నాపై కన్నేశాడు.. మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు

Priya

Narayana – Priya : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆమె అన్నారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. నారాయణ తనను చిత్రహింసలకు గురిచేసేవారని అన్నారు.

ఇంట్లో భార్య ఉండగానే, తాను అన్నం తీసుకురాలేదని ఓ సారి తనను కొట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో రూపంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు. నవ్వుతూ ఆమె తన వ్యాఖ్యలు ప్రారంభించి ఏడుస్తూ ముగించారు.

నారాయణ తమ్ముడి పేరు మణి. ప్రస్తుతం ప్రియ దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ప్రియ చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఈ వివాదం తెరపైకి వచ్చింది.