MLA Rajasingh : టీటీడీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు

తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. అయితే టీటీడీ వివరణ ఇచ్చినా వివాదం ముగియడం లేదు. బాయ్‌కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్ర భక్తులు తీసుకొస్తోన్న చత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారన్నారు.

MLA Rajasingh : టీటీడీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపాటు

Rajasingh

MLA Rajasingh : తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. అయితే టీటీడీ వివరణ ఇచ్చినా వివాదం ముగియడం లేదు. బాయ్‌కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాహనాలపై ఇతర హిందూ దేవుళ్ళ ఫొటోలు, విగ్రహాలను తొలగిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

సీఎం జగన్ తప్పుడు నిర్ణయాలతో హిందూ దేవుళ్ళకు చెడ్డ పేరు వస్తుందన్నారు. మహారాష్ట్ర భక్తులు తీసుకొస్తోన్న చత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారన్నారు. శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం పెద్ద ఇష్యూగా మారిందన్నారు. మహారాష్ట్రలో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తిరుపతి అంటూ పోస్టులు పెట్టడం వైరల్ అవుతోందని రాజాసింగ్ అన్నారు.

College Admissions : ఆగస్టు 1, 2వ తేదీలలో టీటీడీ జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు

ఏపీ సీఎం జగన్ తప్పుడు నిబంధనలు తీసుకురావటమే ఈ వివాదానికి కారణమన్నారు. సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసన్నారు. జగన్ తీరుతో తిరుపతికి, ఏపీకి చెడ్డ పేరు వస్తుందని రాజాసింగ్ అన్నారు.