ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 07:30 AM IST
ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. పంచాయతీ భవనాలకు వేసిన రంగులను తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం 10 రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని సూచించింది. అంతేకాదు.. తమ ఆదేశాలను అమలు చేసినట్లు నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించింది.

రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. గుంటూరు జిల్లా పర్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు ఏవైతే ఉన్నాయో..వాటిపై కీలక తీర్పు ఇచ్చింది. ప్రధానంగా పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. 

కాబట్టి ఎన్నికల కోడ్ లో భాగంగా వైసీపీ రంగులను తొలగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఎస్ అమలు చేయాలని ఆదేశించింది. వైసీపీ రంగులు తొలగించి, పది రోజుల్లో మళ్లీ  వేరే రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. టీడీపీతో సహా విపక్షాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వ కార్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చుతున్నారని విమర్శించారు. పంచాయతీ భవనాలపై వెంటనే వైసీపీ రంగులను తొలగించాలని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 

See Also | ప్రణయ్ హత్య కేసులో 1200 పేజీల ఛార్జ్‌ షీట్‌..సంచలన విషయాలు వెల్లడి