CM Jagan Offer For Farmers : ఎకరాకు రూ.30 వేలు.. రైతులకు సీఎం జగన్ సరికొత్త ఆఫర్

ఏపీ సీఎం జగన్ రాయలసీమ రైతులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామన్నారు.

CM Jagan Offer For Farmers : ఎకరాకు రూ.30 వేలు.. రైతులకు సీఎం జగన్ సరికొత్త ఆఫర్

CM Jagan Offer For Farmers : ఏపీ సీఎం జగన్ రాయలసీమ రైతులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. సోలార్, విండ్ పవర్ సంస్థల కోసం భూములిచ్చే రైతులకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల చొప్పున లీజు ధర చెల్లిస్తామన్నారు. ఈ మేరకు రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని సౌర, పవన విద్యుత్‌ తయారీ సంస్థలకు ఇస్తుందని చెప్పారు.

ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం మేర లీజు ధరను పెంచుతామని జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు సీఎం జగన్. గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలో రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా జగన్ ఈ ఆఫర్ గురించి తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఒక్కో లొకేషన్ లో కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూసేకరణ జరగాలని జగన్ చెప్పారు. ఆ మేరకు రైతులు భూములు ఇచ్చేలా వారిని ఒప్పించేలా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని అన్నారు. ఈ గ్రీన్ గో ప్రాజెక్టుల నిర్మాణాలకు రైతులు కూడా సహకరించాలని కోరారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్స్‌ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడుతూ లీజు అంశాన్ని ప్రస్తావించారు.