AP Govt: టీటీడీ నుండి దేవాదాయశాఖకు ఏటా రూ.50 కోట్లు.. ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.

AP Govt: టీటీడీ నుండి దేవాదాయశాఖకు ఏటా రూ.50 కోట్లు.. ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ!

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. టీటీడీ చెల్లించాల్సిన రూ.50 కోట్లు ఏక మొత్తంలో జమ చేసేలా ఆర్డినెన్స్ లో పేర్కొన్నారు.

టీటీడీ చెల్లించనున్న ఈ రూ.50 కోట్ల మొత్తంలో సర్వశ్రేయో నిధికి రూ.40 కోట్లు చెల్లించనుండగా అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధికి రూ.5 కోట్లు, దేవాదాయ పరిపాలన నిధికి రూ.5 కోట్లు చొప్పున కేటాయించనున్నారు.

రాష్ట్రంలో జాయింట్ కమిషనర్ కేడర్ కలిగిన ఇతర దేవాదాయాలు టీటీడీ కంటే ఎక్కువ మొత్తాన్నే ప్రభుత్వానికి చెల్లిస్తున్నందున.. టీటీడీ చెల్లిచే మొత్తాన్ని పెంచినట్లు అధికారులు వెల్లడించారు.