East Godavari : మొదటి భార్య చెవులు, ముక్కులు కోశాడు..రెండో భార్య చేతిని సలసలాకాగే నూనెలో పెట్టించాడు

అతను ఒకటి కాదు..రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలపైనా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో పైశాచికత్వం ప్రదర్శించాడు.

East Godavari : మొదటి భార్య చెవులు, ముక్కులు కోశాడు..రెండో భార్య చేతిని సలసలాకాగే నూనెలో పెట్టించాడు

Andhra Pradesh

Sadistic Husband : అతను ఒకటి కాదు..రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలపైనా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో పైశాచికత్వం ప్రదర్శించాడు. మొదటి భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో…ఆమెపై కత్తితో దాడి చేశాడు. కటింగ్‌ ప్లేయర్‌తో చెవులు, ముక్కు కోశాడు. కన్నపిల్లలముందే అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. అంతేకాదు..ఈ పైశాచికత్వం మొత్తాన్ని పిల్లలతోనే వీడియో తీయించాడు. ఈ నెల 3న ఈ దారుణం జరిగింది. ఇక మొదటి భార్య ఉండగానే అతను ఏ కారణంతో రెండో పెళ్లి చేసుకున్నాడో తెలియదు గానీ…ఆమెతోనూ అమానుషంగా ప్రవర్తించాడు. రెండో భార్యకూ వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం పెంచుకున్న అతను…సలసలా కాగే నూనెలో ఆమె చేతిని పెట్టించి ప్రమాణం చేయించాడు. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పిందన్న కోపంతో…ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించాడు.

అంతేకాదు…భార్యలిద్దిరినీ చిత్రహింసలకు గురిచేస్తూ…వారితో బలవంతంగా తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పించాడు… ఆ వీడియో పిల్లలతో రికార్డు చేయించాడు. గాయాల బాధ తట్టుకోలేక, భర్త పెడుతున్న చిత్రహింసలు భరించలేక వారిద్దరూ తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని వాళ్లు తప్పుచేసినట్టుగా చిత్రీకరిస్తున్నాడు.

భర్త అరాచకాలను భరిస్తూ మొదటి భార్య మౌనంగా ఉన్నప్పటికీ..రెండో భార్య మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కిరాతకుడి అకృత్యాలు వెలుగుచూశాయి. తన విపరీత మనస్తత్వంతో ఇద్దరు భార్యలకు ప్రత్యక్ష నరకం చూపించిన ఆ భర్త పేరు కళ్యాణం వెంకన్న. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ అరాచకాలు జరిగాయి. రెండో భార్య జయమ్మ ఫిర్యాదుతో వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు పెళ్లిళ్లు చేసుకుని నేరం చేయడమే కాకుండా…భార్యలతో అత్యంత అమానుషంగా ప్రవర్తించిన కళ్యాణం వెంకన్నను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read More : Stock investors : స్టాక్ మార్కెట్ లను ముంచెత్తిన కరోనా, 30 నిమిషాలు..5 లక్షల 27 వేల కోట్ల సంపద ఆవిరి