Sajjala : వామపక్షాలు.. ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాయి-సజ్జల

వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు.

Sajjala : వామపక్షాలు.. ఎవరికి మేలు చేయాలనుకుంటున్నాయి-సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : పీఆర్సీపై సీఎం జగన్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన తర్వాత సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో పీఆర్సీ రగడ సద్దుమణిగిందని అంతా భావించారు. ఇంతలో ఉపాధ్యాయ సంఘాలు అలక బూనాయి. పీఆర్సీ సాధనపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఏకీభవించడం లేదు. మెరుగైన పీఆర్సీ కోసం పోరాడేలా.. ఉపాధ్యాయ సంఘాలు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలిపాయి.

పీఆర్‌సీ జీవోల వల్ల తమకు న్యాయం జరగలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని ఆరోపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.

Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్టే…

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పర సహకారంతో సమస్య పరిష్కారం అయిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఇంకా చేసి ఉండాల్సిందని స్వయంగా సీఎం జగన్ అన్నారని ఆయన చెప్పారు. ఉద్యోగుల్లో కొంతమంది ప్రతిపక్షాలతో కలిసి మళ్లీ ఆందోళన బాట పడతామని అంటున్నారు, ముఖ్యంగా వామపక్ష ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేస్తామంటున్నారు అని సజ్జల అన్నారు. ఉద్యోగ సంఘాలు అమ్ముడుపోయాయని అంటున్నారు, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం కొన్నదని విమర్శలు చేస్తున్నారు.. అసలిక్కడ ఉద్యోగ సంఘాలని కొనేవాళ్లు ఎవరున్నారు అని సజ్జల ప్రశ్నించారు.

వామపక్ష ఉద్యోగ సంఘాలు పీఆర్సీ పెంచాలి అంటే సాధ్యం అవుతుందా? అని ఆయన అడిగారు. ఉద్యోగుల సమ్మె జరిగితే లాభపడొచ్చని చూసిన పార్టీలు.. సమ్మె నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో బాధపడుతున్నాయని అన్నారు. ఆందోళన చేస్తున్న వామపక్ష ఉద్యోగ సంఘాలు కేరళలో HRA ఎంత ఉంది? అని సజ్జల అడిగారు. టీడీపీకి అజెండా ఉందన్న సజ్జల మీకు అదే అజెండా ఉందా? అని అడిగారు.

వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే మంత్రుల కమిటీని వచ్చి కలవొచ్చని సూచించారు సజ్జల.

siddipet firing case : అప్పులు తీర్చటానికి దోపిడీలు..సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద కాల్పుల కేసు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సజ్జల మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంభిస్తుందని పవన్ అనడాన్ని తప్పుపట్టారు. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపుల వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించ లేదని అడిగారు. క్యాసినో అంటూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ మాట్లాడటం చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు కొలిక్కి వచ్చాయని, పరిష్కారం అయిపోతున్నాయని సజ్జల తెలిపారు.

కాగా, స్టీరింగ్‌ కమిటీ తీరును ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి. మెరుగైన పీఆర్సీ కోసం ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించాయి. త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని సంఘాల నేతలు చెప్పారు. ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులు ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తక్షణమే పాత హెచ్‌ఆర్‌ఏ ప్రకటించాలని, పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ 27శాతం ప్రకటించాలని, స్టీరింగ్‌ కమిటీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.