షర్మిల కేసులో పురోగతి:15 సైట్లను గుర్తించిన పోలీసులు

  • Published By: chvmurthy ,Published On : January 16, 2019 / 01:42 PM IST
షర్మిల కేసులో పురోగతి:15 సైట్లను గుర్తించిన పోలీసులు

హైదరాబాద్: సోషల్ మిడియాలో తనపై అసభ్యకరమైన,అసత్య అరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ సోదరి, షర్మిల చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలిసులు విచారణ చేపట్టారు.  సీపీ ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు ఈకేసు దర్యాప్తు కోసం ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఈకేసులో ఇప్పటివరకు అసభ్యకర 15యూఅర్ఎల్ లను గుర్తించిన పోలిసులు,  సోషల్ వీడియోలో ఉన్న కామెంట్స్  సంబంధించి యుఆర్ఎల్ ఫై విచారణ చేస్తున్నారు.
విచారణలో భాగంగా స్పెషల్ టీమ్ పోలీసులు యూట్యూబ్,ఫేసుబుక్ లకు లేఖలు రాశారు. వాటి నుంచి సమాచారం రావాల్సి ఉంది. కొన్ని యూట్యూబ్, ఫేసుబుక్ గ్రూప్స్ లో ఎక్కువగా అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టారని సైబర్ క్రైం అదనపు డిసిపి రఘువీర్ తెలిపారు. వీడియోలు తయారు చేసిన వాళ్ళతో పాటు, వారి వెనుకాల ఉన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. షర్మిల 2014కు ముందు ఇచ్చిన పిర్యాదుపై ముగ్గురుని అరెస్ట్ చేసామని  అదనపు డీసీపీ వివరించారు. 
ఏపీ లో ఎన్నికలు సమీపిస్తున్న  తరుణంలో ,తిరిగి చాలా రోజుల తరువాత మరోసారి అరోపణలు, దుష్ప్రచారం అధికం కావడంతో షర్మిల నేరుగా పోలిసు అదికారులకు కలిసి ఫిర్యాదు చేసారు. తాజాగా ఓ పార్టీకి చెందిన వారు ప్రచారము చేస్తున్న వాటి వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న అంశపై కూడా పోలీసులు ద్రుష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ముందు కావాలనే ఓ పార్టీ తనపై విష ప్రచారం చేస్తోందని షర్మిల అవేదన వ్యక్తం చేశారు. 
కేసు విచారణలో భాగంగా వీడియోలు ఎలా తయారు చేశారు ఏఏ సైట్లలో వీటిని పోస్ట్ చేశారు. ఎప్పుడెప్పుడు వీటిని ప్రచారంలో ఉంచారన్న అనేక విషయాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. పూర్తి స్దాయిలో దర్యాప్తు జరిపి వీటిని పోస్ట్ చేసిన వారిపై సైబర్ క్రైం పోలిసులు మరో 15 రోజుల్లో  చర్యలుతీసుకుంటామనే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇందులో రాజకీయ కోణంతో పాటు హీరో ప్రభాస్ ప్రమేయం ఏవిదంగా ఉందో పరిశిలిస్తామని పోలీసులుతెలిపారు. అవసరమైతే విచారణలో బాగంగా హీరో ప్రబాస్ ను సంప్రదిస్తామన్నారు.  
ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల ఫిర్యాదుపై సైబర్ పోలిసులు నిందితులపై సెక్షన్ 67ఐటి 2000యాక్టుతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా అసత్యాలను ప్రచారం చేయడంతో పాటు కావాలనే ఉద్దేశ్యంతో మహిళలను కించపరిచేలా ప్రచారం చేయడం సెక్షన్ 509కింద మహిళలను కించపరచడం వంటి కేసులు నమోదు చేశారు. ఈ రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరపుతున్నారు. సీఐ ర్యాంకు అధికారితో పాటు, ఓ ఎస్సై అలాగే మరికొంత మంది సిబ్బంది, సిపీ సైబర్ సెల్ కార్యాలయాల్లోని టెక్నికల్ సపోర్టింగ్ స్టాఫ్ తో కేసును త్వరితగతిన చేధించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.