Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని సుప్రీంకోర్టు

అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది.

Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని సుప్రీంకోర్టు

Avinash Reddy (2)

Avinash Reddy : ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఆదేశించింది. మే 25 తేదీన విచారణ జరపాలని ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ పిటిషన్ విచారించాలనే హక్కు పిటిషనర్ కు ఉందని తెలిపింది.

అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది. ముందస్తు బెయిల్ పై హైకోర్టు విచారణ జరిపే వరకు రక్షణ కల్పించాలని అవినాశ్ న్యాయవాది కోరారు. ఈరోజు (మంగళవారం) విచారణకు సిబిఐ న్యాయవాది హాజరు కాలేదు.  ఏప్రిల్ 28న హైకోర్టు లాస్ట్ డే కావడంతో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేమని చెప్పిందని అవినాశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

Supreme Court : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీష‌న్ విచారణకు నిరాక‌రించిన సుప్రీంకోర్టు

మే 15న సీబీఐ నోటీసులు పంపిందని.. అప్పటి వరకు సీబీఐ విచారణకు పిలువలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తరువాత ఈ కేస్ లో హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అవినాశ్ విచారణకు హాజరయ్యాడా అని సర్వోన్నత న్యాయస్థానం అడగ్గా ఇప్పటివరకు సీబీఐ ఎదుట అవినాశ్ రెడ్డి ఏడుసార్లు హాజరయ్యారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు.

అరెస్టు చేసే అవకాశం ఉందా అని సుప్రీం కోర్టు అడగ్గా.. అరెస్టు చేస్తారనే అనుమానంతోనే సుప్రీంకోర్టు ముందుకు వచ్చామని అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది అన్నారు. అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అవినాశ్ తండ్రిని కూడా సీబీఐ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిందని, తల్లిని చూసుకోవడానికి అవినాశ్ రెడ్డి మినహా ఎవరు లేరని అవినాశ్ న్యాయవాది సుప్రీంకోర్టుకు విన్నవించారు.

YS Viveka Case: సీబీఐకి వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరో లేఖ

కాగా, మే 15 తర్వాత మూడుసార్లు నోటీసులు జారీ చేసినా అవినాశ్ రెడ్డి విచారణకు హాజరు కాలేదని సునీత రెడ్డి న్యాయవాది తెలిపారు. తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ పై గురువారం విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.