Supreme Court Surprise : గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

Supreme Court Surprise : గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

Supreme Court (6)

Gangireddy Bail Cancellation : వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్ ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. ఇవి ఎలాంటి ఉత్తర్వులు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తల పట్టుకున్నారు.

ఈ మేరకు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్ కి బదిలీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరుపనుంది. కాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వుల్లో షరతును సవాల్ చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

YS Viveka Case..Ajeya Kallam : వివేకా కేసులో నాకు తెలిసిన సమాచారం సీబీఐకి చెప్పాను : అజయ్ కల్లాం

గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు జులై 1న మళ్లీ విడుదల చేయాలని సీబీఐ కోర్టుకు ఉత్తర్వులు ఇచ్చింది. వివేకా హత్య కేసులో జూన్ 30వ తేదీతో దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందు వల్ల జులై 1న గంగిరెడ్డిని బెయిల్ పై విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

జులై1న మళ్లీ బెయిల్ పై గంగిరెడ్డిని విడుదల చేయాలన్న అంశంపై సునీతారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్ ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన సందర్భాలున్నాయని, సాక్ష్యులను బెదిరించే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తెలిపారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని సునీతారెడ్డి పిటీషన్ లో పేర్కొన్నారు.