Supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.

Supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం

ap capital

Supreme Court : ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది. నిన్న సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే మరోసారి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇదే అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. దీన్ని పరిశీలించి ఈ నెల 23న విచారిస్తామని న్యాయస్థానం వెల్లడించింది.

మరోవైపు సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అటు హైకోర్టులో వచ్చిన తీర్పు మరోసారి సుప్రీంకోర్టులోనూ వస్తుందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్ కు మాత్రమే రాజధాని మార్పు అధికారం ఉందని భావిస్తున్నాయి.

Andhra pradesh : ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు

ఏపీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానుల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. ఈ నెల 23న విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందని, ఈ వివాదంపై తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.