AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత

ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి వెంకటేశ్వరరావు సర్వీసును రీ ఇన్ స్టేట్ చేస్తున్నట్లు ఆ జీవో లో పేర్కోన్నారు.

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత

Ab Venkateswara Rao

AB Venkateswara Rao :  ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి వెంకటేశ్వరరావు సర్వీసును రీ ఇన్ స్టేట్ చేస్తున్నట్లు ఆ జీవో లో పేర్కోన్నారు. కాగా తనను సస్పెన్షన్ చేసినరోజు నుంచి సర్వీసులోకి తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరుతున్నారు. రెండేళ్ల కాలాన్ని కూడా సర్వీసు లోకితీసుకోవాలని కోర్టు చెప్పిందని ఆయన అంటున్నారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం సూచించింది.

సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును 2020 ఫిబ్రవరి8న విధుల్లోంచి తొలగించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఏబీవీ కోర్టులలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు గత నెలలో ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోటానికి సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సస్పెన్షన్ రద్దయ్యింది.

ఏబీవీ సస్పెన్షన్ గడువు ఈ ఏడాది పిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పి విచారణ ముగించింది. ఏబీవీ ఫిబ్రవరి 8నుంచి సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు రావలసిన ప్రయోజనాలు అన్నీ కల్పించాలని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్నాసనం పేర్కోంది. ఈ నేపధ్యంలో ఏబీవీ సస్పెన్షన్ ఎత్తి వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.