Chandrababu Naidu : పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైంది-చంద్రబాబు

ప్రజా తీర్పును వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలన్నారు చంద్రబాబు. వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న చంద్రబాబు.. చివరికి పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందన్నారు.

Chandrababu Naidu : పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైంది-చంద్రబాబు

Chandrababu Naidu : పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపు ప్రజా విజయం అన్నారు చంద్రబాబు. ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చి ఓట్లు వేశారని చెప్పారు. ప్రజా తీర్పును వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి సీఎం జగన్ ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్న చంద్రబాబు.. చివరికి పులివెందులలో కూడా తిరుగుబాటు మొదలైందన్నారు.

” ఈ నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రానికి జగన్ ద్రోహం చేశారు. ఈరోజు జరిగిన ఎన్నికలు, పోరాటం జగన్ వర్సెస్ 5కోట్ల తెలుగు ప్రజలు. ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క జగన్ అరాచకం. ఈ నాలుగేళ్లలో ఎవ్వరూ కూడా పని చేసే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసులు. ఒక్కొక్కరిపై 50 నుంచి 200 కేసులు పెట్టారు. ఇంకోపక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలే పని చేసే పరిస్థితి లేదు. మరో పక్కన చూస్తే పులివెందులలో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది” అని చంద్రబాబు అన్నారు.

Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ.. జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. అధికార మదం తలకెక్కి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావ్.. ప్రజలు ఏకంగా నీకు గుండు కొట్టించారు అని లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు సైకోపాలనపై ప్రజా విజయంగా అభివర్ణించారు. యువగళం దెబ్బకు జగన్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా 2024లో చూపిస్తామన్నారు లోకేశ్.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సెమీఫైనల్స్ అన్నవాళ్లు.. ఫలితాలు వచ్చాక తూచ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డ్యుయేట్స్ ఎమ్మెల్సీ పదవికి పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్లను వైసీపీ నిలబెట్టిందని లోకేశ్ ఆరోపించారు. 108 నియోజకవర్గాల యువత వైసీపీని ఛీ కొట్టిందన్నారు.

Also Read..CM YS Jagan: ఎందుకు తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి..? ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా స్పందించారు. రాష్ట్రంలో అరాచకం ఉందని ప్రజలెప్పుడో గుర్తించారన్న పయ్యావుల.. ఆ ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అని కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వై నాట్ 175 అనే గొంతులు మూగబోయాయన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం అనే పదాలు వైసీపీ డిక్షనరీలోనే లేవన్నారు.

”బుల్డోజ్ అనేది వైసీపీ ఇంటి పేరు. మాస్కు అడిగిన డాక్టర్ సుధాకర్ పై చేసిన అరాచకం నుంచి ఎన్నికల్లో గెలిచిన పశ్చిమ రాయలసీమ అభ్యర్థిని లాక్కెళ్లి అరెస్ట్ చేయడం వరకు బుల్డోజ్ చేయడం కాదా..? ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని మేం నమ్ముతున్నాం. ఏం చేసినా మేం ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం” అని పయ్యావుల కేశవ్ అన్నారు.

Also Read..Nandamuri Balakrishna : ”వై నాట్ 175” అని సీఎం జగన్ ఇప్పుడంటే వినాలని ఉంది-బాలకృష్ణ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఒక్కటి కూడా గెలవలేకపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని టీడీపీ నేతలు అంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని కామెంట్ చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మూడింటికి మూడు స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఇది ప్రజా విజయం అని, మార్పునకి సంకేతం అని, మంచికి మార్గం అని చంద్రబాబు అన్నారు.