Devineni Uma : ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ఆలస్యం : దేవినేని ఉమా

రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్ లో జగన్ రెడ్డి కాంట్రాక్టర్ లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి అసమర్ధతకు తెలుగుజాతి మూల్యం చెల్లించుకుంటోందన్నారు.

Devineni Uma : ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ఆలస్యం : దేవినేని ఉమా

Devineni

Devineni criticized CM Jagan : ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని మాజీ మత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. తమ హయాంలో తక్కువ సమయంలోనే డయాఫ్రం వాల్ నిర్మించామని తెలిపారు. రెండు వరదల సమయంలో కూడా డయాఫ్రం వాల్ నిర్మించామని చెప్పారు. డయాఫ్రం వాల్ నిర్మించి ఇస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ అంటే ఇప్పటివరకు చేసిన ఖర్చు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు.

రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్ లో జగన్ రెడ్డి కాంట్రాక్టర్ లేకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి అసమర్ధతకు తెలుగుజాతి మూల్యం చెల్లించుకుంటోందన్నారు. కమీషన్ల కక్కుర్తి కోసం చేసిన నిర్వాకం వల్లే డయా ఫ్రo వాల్ వద్ద నష్టం జరిగిందని చెప్పారు. డయా ఫ్రo వాల్ కు ఎప్పుడు నష్టం జరిగిందనే సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు.

Devineni Uma : రివర్స్ డ్రామాలాడకుండా ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది-దేవినేని ఉమ

పీపీఏ చెప్పినా లెక్కచేయకుండా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి, జరిగిన నష్టంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన జలవనరుల శాఖపై ఏదేదో మాట్లాడుతున్న మంత్రి అంబటిని ఎవరికైనా చూపించాలని సూచించారు. నిర్లక్ష్యానికి గురైన పోలవరం నిర్వాసితుల ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగులుతుందన్నారు. తెలిసి తెలియని తత్వం, అవగాహన లేని మంత్రులతో జాతికి ద్రోహం చేయొద్దని జగన్ రెడ్డిని కోరుతున్నట్లు పేర్కొన్నారు.