Pattabhi: పట్టాభి ఎక్కడ? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడు?

జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి చేరుకోలేదు.

Pattabhi: పట్టాభి ఎక్కడ? అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడు?

Pattabhi

Pattabhi: జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి చేరుకోలేదు. నిన్న రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పట్టాభి హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం క్రాస్‌ అయ్యారు పట్టాభి.

పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గరకు 10.30 గంటలకు చేరుకున్న పట్టాభి వాహనం.. అక్కడ పోలీసులు పట్టాభి వెంట వస్తున్న వాహనాలను నిలిపివేశారని చెప్తున్నారు. అయితే, పట్టాభి ఇంటికి చేరుకుంటున్న మార్గమధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికేటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలీసులు. పట్టాభి ఎక్కడికి వెళ్లాడో తమకు సంబంధం లేదన్నారు పోలీసులు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

పట్టాభి ఇంటికి చేరుకోలేదని, హైదరాబాద్ వైపు వెళ్లారని సన్నిహితులు చెప్తున్నారు. టీడీపీ నేత పట్టాభి ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీంతో కోర్టులో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బయటికి వచ్చిన పట్టాభి ఇంటికి చేరుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టాభి ఎక్కడికి వెళ్లారనే విషయంపై టీడీపీ నేతలు ఆరా తీశారు.

అయితే, పట్టాభి సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీకి సమాచారం అందినట్లు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పట్టాభి కాన్వాయ్‌లో ఎక్కువ వాహనాలు ఉండటంతో వాటిని మాత్రమే నిలిపివేశామని పోలీసులు నిలిపివేశారు. మళ్లీ అరెస్ట్ చేస్తారనే ఆందోళనతోనే పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

Read More: Pattabhi Release : జైలు నుంచి విడుదలైన పట్టాభి