Kesineni Nani : ఆ గొట్టంగాళ్ళ కోసం పనిచేస్తున్నా.. నాకు 100శాతం మండితే పార్టీ మార్పుగురించి ఆలోచిస్తా

నాకు 100శాతం మండితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా.. అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు అంటూ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kesineni Nani : ఆ గొట్టంగాళ్ళ కోసం పనిచేస్తున్నా.. నాకు 100శాతం మండితే పార్టీ మార్పుగురించి ఆలోచిస్తా

MP kesineni nani

TDP MP kesineni nani : టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వాడీ వేడీ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేశినేని వైసీపీ నేతలను పొగటడం..సొంత పార్టీపై ఘాటు వ్యాఖ్యలో సెటైర్లు వేయటం జరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తున్నా..ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయి అంటూ వ్యాఖ్యానించారు.

 

నాకు 100శాతం మండితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా..అంటూ పార్టీ మార్పుగురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు రావాలని చంద్రబాబు PA ఫోన్ చేస్తే వెళ్ళానని..కానీ అమిత్ షా తో చంద్రబాబు భేటీ ఎందుకో నాకు తెలియదు అని అన్నారు.

 

వేరే పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని కానీ వాటిపై నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలిపిస్తారు అనే మాటకు కట్టుబడి ఉన్నాను అంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టంచేశారు. మహానాడుకు సంబంధించిన తనకు ఆహ్వానం రాలేదని తెలిపారు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని.