తప్పు చేసినట్లయితే..సస్పెండ్ చేయొచ్చు – ఎంపీ కేశినేని నాని

తాను తప్పు చేసినట్లు భావిస్తే..సస్పెండ్ చేయొచ్చని, రాజీనామా చేయాలని ఆదేశిస్తే..ఇప్పుడే రాజీనామా చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తప్పు చేసినట్లయితే..సస్పెండ్ చేయొచ్చు – ఎంపీ కేశినేని నాని

TDP MP Kesineni : తాను తప్పు చేసినట్లు భావిస్తే..సస్పెండ్ చేయొచ్చని, రాజీనామా చేయాలని ఆదేశిస్తే..ఇప్పుడే రాజీనామా చేస్తానని టీడీపీ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

విజయవాడ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నేనైతే పార్టీ కోసమే కష్టపడి పని చేస్తున్నా..విజయవాడ కార్పొరేషన్ పై టీడీపీ జెండా ఎగరాలన్నదే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

పార్టీ ఏది చెబితే..అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తాను తప్పు చేసినట్లు భావిస్తే..సస్పెండ్ చేయొచ్చని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎంపీగా ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందని పరోక్షంగా బుద్ధా వెంకన్నను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తే వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బ్రాహ్మణ, బీసీ సీట్ల కోసమే తాను విబేధించినట్లు, తనను రాజీనామా చేయమని పార్టీ ఆదేశిస్తే…ఈ క్షణమే చేస్తానని చెప్పారు.

విజయవాడ మేయర్ పీఠం కోసం బెజవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతను టీడీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈమెను అభ్యర్థిగా ప్రకటించడం పట్ల..పార్టీలోని కొంతమందికి ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ ప్రాంతానికి చెందిన వారినే మేయర్ అభ్యర్థిగా నిలపాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కోరుతూ వచ్చినా..అది నెరవేరకపోవడంతో కొంత అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది.

కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కేశినేని నాని, బుద్ధా వెంకన్న వర్గాల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రాష్ట్రంలోని 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలు మార్చి 10న జరగనున్న సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరి..ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.