Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Avinash Reddy Bail: హైకోర్టు తీరు ఏమాత్రం బాగోలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాఫ్తు ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఉన్నాయంది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయం అన్న సీజేఐ ధర్మాసనం

Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Avinash Reddy Bail

Avinash Reddy Bail : ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి(ఏప్రిల్ 26) వాయిదా వేసింది హైకోర్టు. రేపు వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని అవినాశ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్డర్ కాపీని అప్ లోడ్ చేయాలని సుప్రీంకోర్టులో మెన్షన్ చేస్తామన్నారు. ఆర్డర్ కాపీ చూపిన తర్వాత తీర్పు చెప్తామన్న న్యాయమూర్తి.. విచారణను రేపటికి వాయిదా వేశారు.

Also Read..Gone Prakash : భారతి కోసమే షర్మిళ, విజయమ్మను దూరంగా పెట్టిన జగన్ : గోనే ప్రకాశ్

మరోవైపు అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ విడుదల చేసింది. మొత్తం 11 పేజీల ఆర్డర్ ఇచ్చింది సీజే ధర్మాసనం. అవినాశ్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరుపై హైకోర్టు వైఖరిని తప్పు పట్టింది సుప్రీంకోర్టు. దర్యాఫ్తు దశలో హైకోర్టులో జోక్యం అవాంఛనీయం అన్న సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులు సీబీఐ దర్యాఫ్తును నీరుగార్చే విధంగా ఉందని అభిప్రాయపడింది. హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని ప్రశ్నోత్తరాల రూపంలో విచారించాలని సీబీఐని ఆదేశించాల్సిన అవసరం కోర్టుకు లేదని సీజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది.(Avinash Reddy Bail)

Also Read..Ramesh Naidu: ఏపీలో సంచలన రాజకీయ మార్పులు.. జగన్ కు త్వరలో షాక్ తగలబోతోంది..

హైకోర్టు తీరు ఏమాత్రం బాగోలేదని సీజే ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాఫ్తు ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఉన్నాయంది సుప్రీం ధర్మాసనం. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయం అన్న సీజేఐ ధర్మాసనం.. సీబీఐ చార్జిషీటులో లేని పలువురు నిందితుల పాత్ర గురించి విస్తృతంగా దర్యాఫ్తు చేస్తున్న సమయంలో హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం అవాంఛనీయం అంది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలను తప్పుగా అన్వయించుకుని హైకోర్టు అసాధారణమైన ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో గతంలో అవినాశ్ రెడ్డికి 160 Crpc నోటీసులు జారీ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ గతంలోనే ఎంపీ అవినాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారించిన కోర్టు.. ఈ నెల 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి వీల్లేదని గతంలో ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ఇవాళ బయటికి వచ్చింది. ఇవాళ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న హైకోర్టు ఉత్తర్వులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.