KTR Vs AppalaRaju: ఏపీలో రోడ్లపై కేటీఆర్ సెటైర్: కౌంటర్ ఇచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు

ఏపీలో నాడు- నేడు పథకంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ప్రశంసించాయని..కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా..మా ప్రభుత్వ విధానాలను అనుసరించారని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు

KTR Vs AppalaRaju: ఏపీలో రోడ్లపై కేటీఆర్ సెటైర్: కౌంటర్ ఇచ్చిన మంత్రి సీదిరి అప్పలరాజు

Ktr

KTR Vs AppalaRaju: ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ధ్వంసమై పోయాయని, అక్కడ కనీసం విద్యుత్ కూడా సమయానికి ఉంటుందో లేదో అర్ధం కావడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ వాళ్లను నాలుగు బస్సులో తీసుకెళ్లి చూపిస్తే ఇక్కడేంత(తెలంగాణలో) బాగుందో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో పరిస్థితులు ఎంతో మెరుగ్గా ఉన్నాయనే విషయాన్నీ చెప్పేందుకు మంత్రి కేటీఆర్ ఇలా వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై తెలంగాణ మంత్రి సెటైర్లు వేయడంపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ మంత్రి కేటీఆర్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గురించి అలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఏపీకి 4 కాదు 40 బస్సులు వేసుకురావాలని మంత్రి అప్పలరాజు కేటీఆర్‌కు సవాల్ విసిరారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం మా ఉద్దేశం కాదన్నా మంత్రి అప్పలరాజు..ఏపీలో తమ ప్రభుత్వ విధానం, అభివృద్ధి చూడాలని చెప్పారు.

Also read:Nitin Gadkari : ప్రారంభమైన ప్రాజెక్టులు ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది

ఏపీలో నాడు- నేడు పథకంపై తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు ప్రశంసించాయని..కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక కూడా..మా ప్రభుత్వ విధానాలను అనుసరించారని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. కేటీఆర్ లాంటి బాధ్యత కలిగిన వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదంటూ కౌంటర్ ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పకుండా ఖండిస్తామని అన్నారు. మీ రాష్ట్రాన్ని మీరు పొగుడుకోండి..మాకు సంబంధంలేదంటూ..కానీ మా రాష్ట్రాన్ని విమర్శిస్తే సహించేది లేదంటూ మంత్రి అప్పలరాజు కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Guntur : ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం

తెలంగాణలో పరిస్థితులు అందరికీ తెలుసునని, ఏపీని ఎన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయో కేటీఆర్‌కు కూడా తెలుసని మంత్రి అప్పలరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పై ఇప్పుడు విమర్శలు చేస్తున్న కేటీఆర్ కు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో జరిగిన అభివృద్ధి కనిపించలేదా అని అన్నారు. హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వచ్చింది వైఎస్‌ఆర్‌ వల్లే వచ్చిందన్న మంత్రి అప్పలరాజు..హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర ఏమిటని? ప్రశ్నించారు.

Also read:Narayanaswamy : ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు