TDP Mahanadu : డిజిటల్ రూపంలో మహానాడు..అంతా ‘జూమ్‌’ లోనే

మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్‌ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుంది. మూడున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో.. మహానాడు పెద్ద పండుగ. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులతో.. ఏటా మే నెల 27, 28, 29 తేదీల్లో ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీ.

TDP Mahanadu : డిజిటల్ రూపంలో మహానాడు..అంతా ‘జూమ్‌’ లోనే

Cbn Mahanadu

Telugu Desam Party : మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్‌ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుంది. మూడున్నర దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో.. మహానాడు పెద్ద పండుగ. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులతో.. ఏటా మే నెల 27, 28, 29 తేదీల్లో ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీ.

మహానాడు రెండో రోజు.. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహణకు.. ప్రాంగణం ఎంపిక నుంచి.. పార్టీ కార్యకర్తలకు వడ్డించే భోజనం దాకా.. ప్రతి అంశాన్ని పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అయితే.. కరోనా ఉద్ధృతి కారణంగా.. గతేడాదిలాగే.. ఈసారి కూడా మహానాడు డిజిటల్‌గానే సాగనుంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ ప్లీనరీ మహానాడుని నిర్వహించాలంటే.. 3 వారాల నుంచి నెల రోజుల సమయం కావాలి. అప్పుడు మాత్రమే.. ప్లీనరీని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. మహానాడు స్టేజీ దగ్గర్నుంచి.. ప్రతినిధులకు పిలుపు, రిజిస్ట్రేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, అధినేత సందేశం, అంశాల వారీగా తీర్మానాలు, కీలకమైన రాజకీయ తీర్మానం విషయంలో.. పార్టీ నేతలు సుదీర్ఘ కసరత్తు చేస్తారు. అయితే.. కరోనా కారణంగా.. వరుసగా రెండోసారి వర్చువల్‌గానే మహానాడు జరిపేందుకు తెలుగుదేశం సిద్ధమైంది.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పదుల సంఖ్యలో మాత్రమే నేతలతో చర్చించేందుకు అవకాశం ఉంటుంది. కానీ.. ఒకేసారి వేలాది మందితో ఆన్‌లైన్ మహానాడుకు తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. ఇందుకనుగుణంగా.. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు.. తీర్మానాలపై చర్చించారు. మహానాడు ఏర్పాట్లు, ఆహ్వానాలు, తీర్మానాలపై ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకున్నారు. మృతి చెందిన టీడీపీ నేతలు, కోవిడ్ మృతులకు సంతాపం తెలుపుతూ తొలి తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అదేవిధంగా.. ఎన్టీఆర్‌కి ఘనంగా నివాళులర్పించనున్నారు.

ఇక.. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం, సీఎం జగన్ నిర్లక్ష్యం, ఆక్సిజన్ అందక కరోనా బాధితుల మృతి, వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వం చేతకానితనం లాంటి అంశాలపై తీర్మానం ప్రవేశపెట్టాలని నేతలు సూచించారు. అలాగే.. వ్యవసాయం, ఇరిగేషన్ నిర్వహణలో ప్రభుత్వ అవగాహనా లోపం, చిత్తశుద్ధి లేమి, రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ పేరుతో రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపైనా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వైన్, మైన్, ల్యాండ్, శాండ్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న పనుల తీరును ఎండగడుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు.

ప్రజావేదిక కూల్చివేత మొదలుకొని.. ప్రతిపక్షాలపై దాడులు, ప్రశ్నించిన వారి ఆస్తుల ధ్వంసంతో.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపైనా తీర్మానం చేయాలని నిర్ణయించారు. సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం, బూత్ కమిటీల పటిష్టతతో పాటు ప్రభుత్వ అధికార దుర్వినియోగం, కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతూ.. వైసీపీ నేతలు రాజ్యహింసకు పాల్పడుతున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం చేయాలని.. నేతలు సూచించారు. దీనికి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

Read More : Black fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నాయని..తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన కొడుకు