Corona Positive : కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 70 మంది విద్యార్థులకు కరోనా.. అయినా ఎగ్జామ్స్ కు హాజరుకావాలని ఆదేశాలు

రిమ్స్ మెడికల్ కళాశాలలో 150 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు ముగిశాయి. మొత్తం 150 మందికి గానూ 70 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.

Corona Positive : కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో 70 మంది విద్యార్థులకు కరోనా.. అయినా ఎగ్జామ్స్ కు హాజరుకావాలని ఆదేశాలు

Rims 11zon

Corona positive for 70 students : ఏపీలో మళ్లీ క‌రోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కడప జిల్లా రిమ్స్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. 150 మంది ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్దులలో దాదాపు 70 మందికి కరోనా సోకింది. రేపటి నుంచి MBBS ఫైనల్ పరిక్షలు జరిగే క్రమంలో కరోనా కలకలం రేపడంతో విద్యార్దులలో ఆందోళన నెలకొంది. కరోనాతో పరీక్షలకు హాజరు కావల్సిన పరిస్దితి దాపురించింది. కరోనా వచ్చినా పరీక్షలకు హాజరు కావాలని చెప్పారని వైద్య విద్యార్దులు అంటున్నారు.

రిమ్స్ మెడికల్ కళాశాలలో 150 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు ముగిశాయి. మొత్తం 150 మందికి గానూ 70 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది. రేపు జరుగనున్న ఫైనల్ ఇయర్ పరీక్షలను కోవిడ్ సోకిన విద్యార్థులు ప్రత్యేక రూమ్ లో పరీక్షలు రాయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తాము పరీక్షలకు హాజరు కాలేమని, వాయిదా వేయాలని కరోనా సోకిన విద్యార్థులు కోరుతున్నారు.

Nara Lokesh Corona : టీడీపీ నేత నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

మరోవైపు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తాను తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో నిన్న 30,022 కరోనా నిర్థార‌ణ పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,06,280 కి పెరిగింది. వైరస్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14,510 కి పెరిగింది.

YS Jagan Mohan Redddy : వ్యాక్సినేషన్ వేగవంతం చేయండి-సీఎం జగన్ ఆదేశం

ఆదివారం 669 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26వేల 770కి పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,000 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.