AP High Court : ప్రభుత్వ సలహాదారులపై మరోసారి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై మరోసారి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఏ, డీఏల కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు.

AP High Court : ప్రభుత్వ సలహాదారులపై మరోసారి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP COURT

AP High Court : ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై మరోసారి ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారుగా చంద్రశేఖర్ నియామకాలపై హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. నిపుణులనే సలహాదారులుగా నియమిస్తున్నామని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీఏ, డీఏల కోసం మరో సలహాదారున్ని నియమిస్తారా అని ప్రశ్నించారు.

జనవరి 5,2022న సలహాదారుల నియామకంపై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. సలహాదారుల నియామకంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలా వదిలేస్తే రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారని కోర్టు తెలిపింది. ఐఏఎస్ అధికారులు ఉండగా శాఖలకు సలహాదారులు ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకంపై రాజ్యాంగబద్దతను తేలుస్తామని స్పష్టం చేసింది.

AP High Court : దేవాదయశాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకంపై ఏపీ హైకోర్టు స్టే .. ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు వేస్తూ కీలక వ్యాఖ్యలు

సలహాదారుల పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శ్రీకాంత్ పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులను సవరించింది. సలహాదారుగా కొనసాగేందుకు శ్రీకాంత్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ఇవాళ సలహాదారుల నియామకంపై మరోసారి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.