CJI NV Ramana: ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీజేఐ

ప్రభుత్వాల పనితీరుపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై నిర్లక్ష్యంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎన్వీ రమణ.

CJI NV Ramana: ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీజేఐ

Nv Ramana

CJI NV Ramana: ప్రభుత్వాల పనితీరుపై సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు న్యాయవ్యవస్థపై నిర్లక్ష్యంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎన్వీ రమణ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. ప్రజలకు కోర్టులపై నమ్మకం ఉంది కనుకనే 4కోట్ల కేసులు కోర్టుల్లో ఉన్నాయని అన్నారు జస్టిస్‌ ఎన్వీ రమణ.

న్యాయమూర్తులకు జరిగే అవమానాలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని, వ్యవస్థలన్నీ కలిసి పనిచేయకపోతే చివరికి చేరేది న్యాయవ్యవస్థ వద్దకేనని.. డబ్బుల్లేక న్యాయం జరగలేదనే పరిస్థితి రాకూడదని సీజేఐ అన్నారు. టెక్నాలజీ కోసం సబ్సిడీలు ఇచ్చి సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరామరి సీజేఐ చెప్పుకొచ్చారు.

అయితే, ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. ప్రజలకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని అన్నారు సీజేఐ. న్యాయవాదులు కూడా పేదలకు ఉచిత న్యాయం అందేలా చూడాలని కోరారు. విజయవాడలో కోర్టు భవన నిర్మాణం పూర్తవకపోవడంపై సీజేఐ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు ఎన్వీ రమణ.

ప్రభుత్వాలు మారినా బిల్డింగ్‌ పూర్తవకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు సీజేఐ. ఏపీ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఏర్పాటు చేసిన.. తేనీటి విందుకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు జస్టిస్‌ ఎన్వీ రమణ. సీఎం జగన్‌ దంపతులు కూడా ఈ తేనీటి విందులో పాల్గొన్నారు.