Kondapalli : కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం..భారీ భద్రత..144 సెక్షన్ అమలు

కొండపల్లి ఛైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మొదలైంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నిక నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌ పరిసరాల్లో బారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు.

Kondapalli : కొండపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం..భారీ భద్రత..144 సెక్షన్ అమలు

Kondapally

Kondapalli chairman election : తీవ్ర ఉత్కంఠ నడుమ కొండపల్లి ఛైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక మొదలయింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. ఎన్నిక నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌ పరిసరాల్లో బారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ ఆఫీస్‌కు వచ్చే అన్నిదారులను పోలీసులు నిర్బంధించారు. కొండపల్లి మున్సిపల్‌ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉండగా… టీడీపీకి 15, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే.. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ ఎక్స్‌అఫిషియో ఓటును వినియోగించుకోనున్నారు. ఎక్స్‌అఫిషియో ఓట్లు కలిపి టీడీపీ 16, వైసీపీకి 15 మంది సభ్యులు ఉన్నారు.

వైసీపీ, టీడీపీ క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో హైడ్రామా కొనసాగుతోంది. కౌన్సిలర్లతో వస్తున్న దేవినేనిని పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమకు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసుల అనుమతి లేకపోవడంతో దేవినేని వెనుదిరిగారు. టీడీపీ దొంగ ఓట్లపైనే తమకు అభ్యంతరమని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కోర్టు నిర్ణయం శిరోధార్యమన్నారు.

MLC Elections : తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు 96 నామినేషన్లు.. నేడు పరిశీలన

ఎంపీ కేశినేని ఎక్స్‌ ఆఫిషియో ఓటు హక్కుపై కూడా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేశినేని నాని ఓటు వేసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఆ ఓటు పరిగణనలోకి తీసుకోవాలా.. వద్దా.. అన్నది మాత్రం తాము నిర్ణయిస్తామంది.. అప్పటి వరకు ఫలితాలు మాత్రం విడుదల చేయవద్దని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను హైకోర్టు ఆదేశించింది.

విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. అయితే సజావుగా ఎన్నిక జరుగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇవాళ ఎన్నిక సజావుగా జరిగేలా పోలీసులు చూడాలని కోరారు.